Amarinder Singh : బీజేపీలో చేరికపై మాజీ సీఎం కంగ్రాట్స్
కాంగ్రెస్ కు షాక్ బీజేపీకి జంప్
Amarinder Singh : పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్లు , మాజీ మంత్రులు భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరి చేరికను స్వాగతించారు మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్.
సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారంటూ కితాబు ఇచ్చారు. బల్బీర్ సింగ్ , సిద్దూ, గురుప్రీత్ ఎస్ కంగర్ , డాక్టర్ రాజ్ కుమార్ వెర్కా, సుందర్ షామ్ అరోరా , కేవల్ సింగ్ థిల్లాన్ లను అభినందించారు.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఖాళీ కావడం ఖాయమని జోష్యం చెప్పారు. చేరిన వారిలో కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న ఐదుగురు నాయకులు ఉన్నారు.
మాజీ మంత్రులు రాజ్ కుమార్ వెర్కా, బల్బీర్ సింగ్ సిద్దూ, సుందర్ శామ్ అరోరా, గురు ప్రీత్ సింగ్ కంగర , కేవల్ థిల్లాన్ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
రాష్ట్ర రాజకీయాలలో ఇది పెను సంచలనంగా పేర్కొన్నారు మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్(Amarinder Singh). అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ సీఎంగా 9 ఏళ్ల పాటు పని చేశారు సింగ్.
కానీ పీసీసీ చీఫ్ గా ఉన్న సిద్దూ, సింగ్ ల మధ్య ఆధిపత్య పోరు చివరకు తను పార్టీని వీడేలా చేసింది. తనతో పెట్టుకుని, ముప్పు తిప్పలు పెట్టిన నవ జ్యోత్ సింగ్ సిద్దూ జైలు పాలయ్యాడు.
ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టిన దెబ్బకు మాజీ సీఎంలు, మాజీ ఎమ్మెల్యేలు ఇంటి బాట పట్టారు. ఆప్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది.
Also Read : కాశ్మీర్ ముమ్మాటికీ భారత్ దే – కేజ్రీవాల్