Mayawati : ఆదివాసీ బిడ్డకు బహుజన నేత మద్దతు
బీఎస్పీ చీఫ్ మాయావతి ప్రకటన
Mayawati : ప్రతిపక్షాలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ). ఆ పార్టీ చీఫ్ , మాజీ యూపీ సీఎం మాయావతి(Mayawati) సంచలన ప్రకటన చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు.
భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ (ఎన్డీయే) ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ గవర్నర్ , ఒడిశా ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ముకు తాము మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉండగా ఈనెల 24న ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవి కోసం నామినేషన్ దాఖలు చేశారు. వచ్చే జూలై నెల 18న పోలింగ్ జరగనుంది.
21న రిజల్ట్ ప్రకటిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. తమ పార్టీ అధికార పక్షమా లేక విపక్ష పార్టీలా అన్నది పరిగణలోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. భారత దేశ చరిత్రలో ఆదివాసీలకు అవకాశం రాలేదన్నారు.
అందుకే తాము ద్రౌపది ముర్ముకు మద్దు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు మాయావతి(Mayawati). గిరిజన సమాజాన్ని తమ ఉద్యమంలో ప్రధాన భాగంగా గుర్తించిందన్నారు.
ఈ సందర్భంగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా ఫోన్ కూడా చేశారని తెలిపారు. అయితే ఆమె పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు.
ఢిల్లీలో ఈనెల 15న అన్ని పార్టీలను పిలిచారు. కానీ బీఎస్పీనీ పిలవలేక పోయారని ఆరోపించారు. దీదీతో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా తమను పరిగణలోకి తీసుకోలేదని మండిపడ్డారు.
పరిణామాలతో సంబంధం లేకుండా తాము ద్రౌపది ముర్ముకు సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు.
Also Read : సామాజిక మాధ్యమాలపై కేంద్రం ఫోకస్