Mayawati Jyotirao Phule : మహాత్ముడు పూలే – మాయావతి
ఈ దేశానికి వెలుగునిచ్చిన మహనీయుడు
Mayawati Jyotirao Phule : జ్యోతిబా పూలే మహనీయుడు. ఆయన తన జీవితాంతం విద్య కోసం , విముక్తి కోసం , అణగారిన వర్గాల కోసం ప్రయత్నం చేశాడని కొనియాడారు యూపీ మాజీ సీఎం మాయావతి. ఆయన లేక పోతే ఇవాళ విద్య అనేది అందని ద్రాక్ష పండు లాగా మారి పోయి ఉండేదని పేర్కొన్నారు. ఈ దేశానికి స్వేచ్ఛ లభించి 75 ఏళ్లవుతున్నా నేటికీ ఇంకా పేదరికం , కుల వివక్ష కొనసాగుతూనే ఉందని ఆవేదన చెందారు.
మహిళలు చదువు కోవాలని, వారికి ప్రత్యేకంగా బడులు ఉండాలని కోరిన వ్యక్తి. ఆయన ప్రతి క్షణం ప్రజల కోసం పని చేశాడని కొనియాడారు మాయావతి. ఇవాళ ఆయన జయంతి. ఆయనకు ఘణంగా నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
మంగళవారం ట్విట్టర్ వేదికగా జ్యోతిబా పూలే ను స్మరించుకున్నారు. ఆయన చూపిన దారి గొప్పదని, లక్షలాది మందిని నేటికీ ప్రభావితం చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ఈ దేశానికి దిశా నిర్దేశం చేసిన మహనీయుల్లో మొదటి వ్యక్తి జ్యోతి బా పూలే(Mayawati Jyotirao Phule) అని ప్రశంసించారు.
ఆయన ప్రభావం వల్లనే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అలుపెరగకుండా నిమ్న జాతుల కోసం, బాధితుల కోసం తన గొంతు వినిపించారని స్పష్టం చేశారు మాజీ సీఎం మాయావతి. ఈ లోకం ఉన్నంత దాకా జ్యోతి బా పూలే బతికే ఉంటారని పేర్కొన్నారు.
Also Read : సీఎం గెహ్లాట్ పై పైలట్ దీక్ష