Ex CM YS Jagan : ఢిల్లీ జంతరమంతర్ ఆందోళనకు మద్దతు పలికిన ఎంపీ అఖిలేష్ యాదవ్

కాగా.. గత రాత్రే ఢిల్లీకి చేరుకున్న జగన్.. జంతర్‌మంతర్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్నారు...

Ex CM YS Jagan : ఏపీలో జరుగుతున్న అరాచకాలకు నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఆందోళనకు దిగారు. జగన్‌తో ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నాలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులపై జంతర్ మంతర్ వద్ద ఫోటో ఎగ్జిబిషన్, వీడియో ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. వైసీపీ ఆందోళనకు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మద్దతు తెలిపారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అలాగే శివసేన (ఉద్ధవ్ థాకరే గ్రూప్) ఎంపీ సంజయ్ రౌత్ కూడా వైసీపీ ధర్నాకు మద్దతు పలికారు.

Ex CM YS Jagan…

కాసేపటి క్రితమే వైసీపీ ఆందోళన ముగిసింది. ఈ సందర్భంగా ఢిల్లీలో వైసీపీ ఆందోళనకు హాజరైన ప్రతి ఒక్కరికి జగన్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే హాజరుకాకపోయినా మద్దతు తెలిపిన వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. జంతర్ మంతర్‌లో జరుగుతున్న వైసీపీ ఆందోళనకు ఇక్కడికి వచ్చి మద్దతు తెలపడమే కాకుండా రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలను చూసి సంఘీభావం తెలిపిన పార్టీల నేతలకు కృతజ్ఞతలు అని చెప్పారు. ధర్నాలో భాగంగా ఏపీ సర్కార్‌పై జగన్ విరుచుకుపడ్డారు. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 30 వరకు హత్యలు జరిగాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న హేయమైన పనులపై జర్నలిస్టులు ఇకనైనా గళం విప్పాలని వైసీపీ అధినేత జగన్(Ex CM YS Jagan) పేర్కొన్నారు.

కాగా.. గత రాత్రే ఢిల్లీకి చేరుకున్న జగన్(Ex CM YS Jagan).. జంతర్‌మంతర్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. అలాగే మరో మూడు రోజుల పాటు ఢిల్లీలోనే వైసీపీ అధినేత ఉండనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పలువురు కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్‌లను జగన్ కోరారు. వీరిని కలిసి రాష్ట్రంలో జరగుతున్న హింసాత్మక ఘటనలను కేంద్ర పెద్దలకు వివరించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీలో జగన్ చేస్తున్న ధర్నాపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అసెంబ్లీకి ఎగ్గొట్టాలనే ధర్నాలు చేస్తున్నారన్నారు.

ఢిల్లీ వెళ్ళి తుగ్లక్ రెడ్డి ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. జగన్‌(Ex CM YS Jagan)కు రెడ్ బుక్ అంటే భయపడుతున్నారని… ఢిల్లీ వెళ్ళి అక్కడ కూడా రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారని, ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష సభ్యుడుగా హుందాగా వ్యవహరించాలని హోంమంత్రి వంగలపూడి అని అన్నారు. జగన్ ఢిల్లీలో ఫొటో ఎగ్జిబిషన్ పెట్టారని.. అందులో వైసీపీ హయాంలో జరిగినవి ఉన్నాయేమో చూసుకోవాలన్నారు. వైసీపీ హయాంలో జరిగిన ఘటనలు ఢిల్లీలో ఫొటో ఎగ్జిబిషన్ పెట్టాలి కదా జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో తమరు చేసిన ఘటనలు ఎగ్జిబిషన్ పెడితే ఢిల్లీ సగం సరిపోదంటూ హోంమంత్రి అనిత విమర్శలు గుప్పించారు.

Also Read : Minister Seethakka : 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ప్రజాస్వామ్య బద్దంగా నడుస్తుంది

Leave A Reply

Your Email Id will not be published!