AAP Rajyasabha : రాజ్య‌స‌భ‌కు ఆప్ న‌లుగురికి ఛాన్స్

భ‌జ్జీ..చ‌ద్దా..పాఠ‌క్..మిట్ట‌ల్

AAP Rajyasabha : రాజ్య‌స‌భ‌కు న‌లుగురిని నామినేట్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ . అంతా అనుకున్న‌ట్లుగానే మాజీ భార‌త క్రికెట్ ప్లేయ‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ (Harbhajan Singh) (భ‌జ్జీ)తో పాటు పంజాబ్ ఆప్ ఇన్ చార్జిగా ఉన్న రాఘ‌వ్ చ‌ద్దా, ఐఐటీ ప్రొఫెస‌ర్ సందీప్ పాఠ‌క్ , ప్రముఖ విద్యావేత్త అశోక్ కుమార్ మిట్ట‌ల్ ఉన్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఆప్ కు రాజ్య‌స‌భ‌లో 3 సీట్లకు ప్రాతినిధ్యం వ‌హిస్తోంది.

తాజాగా పంజాబ్ రాష్ట్రంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ 117 సీట్ల‌కు గాను 92 సీట్లు గెలుచుకుంది.

దీంతో ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్య‌స‌భ‌లో(AAP Rajyasabha) సీట్ల సంఖ్య పెర‌గ‌నుంది.

ప్ర‌స్తుతం పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ (Bhagwant Mann) కు అత్యంత స‌న్నిహితుడిగా పేరొందారు హ‌ర్బ‌జ‌న్ సింగ్.

ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన వెంట‌నే భ‌జ్జీకి రాజ్య‌స‌భ (AAP Rajyasabha)సీటు కానీ లేదా పంజాబ్ లో కొత్త‌గా ఏర్పాటు చేయ‌బోయే స్పోర్ట్స్ యూనివ‌ర్శిటీ

వీసీగా ఛాన్స్ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. వాట‌న్నింటికి తెర దించుతూ ఇవాళ ఆప్ భ‌జ్జీని డిక్లేర్ చేసింది.

దీంతో ఎగువ స‌భ‌లో మూడు సీట్ల నుంచి బ‌లం ఎనిమిది సీట్ల‌కు పెరిగింది. ఐదు రాజ్య‌స‌భ స్థానాలు వ‌చ్చే ఏప్రిల్ 9న ఖాళీ అవుతాయి.

ఈనెల 31న ఎన్నిక‌ల కోసం ఇవాళే పేర్లు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

ఇదిలా ఉండ‌గా ఎన్నిక‌ల‌కంటే ముందు 41 ఏళ్ల భ‌జ్జీ కాంగ్రెస్ మాజీ చీఫ్ సిద్దూతో భేటీ అయ్యారు.

ఆయ‌న ఎన్నిక‌ల్లో పోటీ చేస్తార‌ని భావించారు. ఈ విష‌యాన్ని ఆయ‌న కొట్టి పారేశారు.

ఇక ఐఐటీలో ఫిజిక్స్ ప్రొఫెస‌ర్ అయిన సందీప్ పాఠక్ పంజాబ్ లో ఆప్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు.

ఆయ‌న కేజ్రీవాల్ కు, సీఎం మాన్ కు స‌న్నిహితుడిగా పేరొందారు.

ఇక ఆప్ కు చెందిన రాఘ‌వ్ చ‌ద్దా ఢిల్లీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక అశోక్ కుమార్ మిట్ట‌ల్ లవ్లీ ప్రొఫెష‌న‌ల్ యూనివ‌ర్శిటీ వ్య‌వ‌స్థాప‌కుడు. ప్ర‌ఖ్యాత విద్యావేత్త‌, సామాజిక కార్య‌క‌ర్త‌గా పేరొందారు.

Leave A Reply

Your Email Id will not be published!