Jupalli Vs Beeraam : ‘జూపల్లి..బీరం’ సవాళ్ల పర్వం
కొల్లాపూర్ లో హై టెన్షన్
Jupalli Vs Beeraam : ఉమ్మడి పాలమూరు జిల్లాలో సవాళ్ల పర్వం మొదలైంది. సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు బహిర్గతమైంది.
నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతూ వస్తోంది కొల్లాపూర్ నియోజకవర్గంలో. ఇవాళ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్ష వర్దన్ రెడ్డిల(Jupalli Vs Beeraam) మధ్య సవాళ్ల పర్వం చివరకు ఉద్రిక్తతకు దారి తీసింది.
ఎవరి హయాంలో ఎలాంటి అభివృద్ది జరిగిందో తేల్చుకుందాం దా అంటూ ఇద్దరు నేతలు సవాళ్లు విసురుకున్నారు. ప్రస్తుతం అంబేద్కర్ చౌరస్తాకు వస్తే నువ్వో నేనే తేల్చుకుందాం అంటూ ప్రకటించారు.
దీంతో ఇరు నాయకులను పోలీసులు ఇళ్లలోనే ఉంచారు. ఎమ్మెల్యే తరపున భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలి వచ్చారు. మరో వైపు జూపల్లి వర్గీయులు కూడా రెడీ అయ్యారు.
ఏ మాత్రం ఈ ఇద్దరు నేతలు నోరు జారినా పరిస్థితి చేయిదాటి పోయే ప్రమాదం ఉందని పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు 144 సెక్షన్ విధించారు.
మరో వైపు ఇవాళ ఆదివారం కావడంతో కొల్లాపూర్ లో సంత జరుగుతుంది. ఇక్కడ నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల ప్రజలు ఇక్కడికి వస్తారు. సంతలపై ఆధారపడి చిరు వ్యాపారులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది.
ఇదిలా ఉండగా తాను రెడీగా ఉన్నానని జూపల్లి(Jupalli Vs Beeraam) సవాల్ ను స్వీకరిస్తున్నానని చెప్పారు ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి. జూపల్లి చెల్లని రూపాయంటూ సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఎమ్మెల్యే తీరుపై సీరియస్ అయ్యారు జూపల్లి కృష్ణారావు.
Also Read : పంతుళ్ల ప్రతాపం తలవంచిన ప్రభుత్వం