Raja Pateria : మోడీపై కామెంట్స్ రాజా పటేరియా అరెస్ట్
ప్రధానిని చంపేందుకు సిద్దంగా ఉండండి
Raja Pateria : ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేందుకు సిద్దంగా ఉండండి అంటూ సంచలన కామెంట్స్ చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి రాజా పటేరియాకు కోలుకోలేని షాక్ తగిలింది. రాష్ట్ర హోం శాఖ మంత్రి వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాజా పటేరియాను మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.
భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, దానిని నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నాడని అందుకే మోడీని చంపేందుకు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు రాజా పటేరియా(Raja Pateria). ఆయన గతంలో మంత్రిగా పని చేశారు కాంగ్రెస్ హయాంలో. ఇదిలా ఉండగా ఆయన చేసిన సీరియస్ కామెంట్స్ కలకలం రేపాయి.
ఇందుకు సంబంధించిన వీడియో హల్ చల్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేశ వ్యాప్తంగా కాషాయ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. వెంటనే రాజా పటేరియాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా ఎదుర్కోలేక ఇలాంటి నాయకులతో జనాన్ని రెచ్చగొట్టేలా చేస్తోందంటూ ధ్వజమెత్తారు.
మరో వైపు ప్రధానమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాజా పటేరియాపై పన్నా లోని పావై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కాగా పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీ మతం, కులం, భాష ఆధారంగా విభజిస్తారు. దళితులు, గిరిజనులు, మైనార్టీల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని అన్నారు.
రాజ్యాంగాన్ని కాపాడాలి అతడిని చంపేందుకు సిద్దంగా ఉండండి అని పిలుపునిచ్చారు రాజా పటేరియా.
Also Read : సరిహద్దు వివాదం ప్రతిపక్షాలు ఆగ్రహం