Ex Minister Sita Devi : మాజీ మంత్రి, విజయ డైరీ డైరెక్టర్ మృతి

యెర్నేని సీతాదేవికే కాదు ఆమె కుటుంబానికి కూడా రాజకీయ నేపథ్యం ఉండడం గమనార్హం...

Ex Minister : మాజీ మంత్రి, విజయ డెయిరీస్ మేనేజింగ్ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె ఈ ఉదయం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. సీతాదేవి జన్మస్థలం కైకలూరు మండలం కోడూరు, ఏపీ. ఆమె ముదినేపల్లి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. దీని తర్వాత సీతాదేవి భారతీయ జనతా పార్టీలో చేరారు. సీతాదేవి మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.

Ex Minister Yerneni Sita Devi

యెర్నేని సీతాదేవికే కాదు ఆమె కుటుంబానికి కూడా రాజకీయ నేపథ్యం ఉండడం గమనార్హం. ఆమె భర్త నాగేంద్రనాథ్ ఆంధ్రప్రదేశ్ రైతాంగ సమాఖ్య చైర్మన్‌గా, కొల్లేరు పరిరక్షణ కమిటీ సభ్యుడిగా, కృష్ణా గోదావరి పెన్నార్ డెల్టా డ్రైనేజీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. నాగేంద్రనాథ్ ఏడాది క్రితం మరణించారు. నాగేంద్రనాథ్, సీతాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Also Read : Cyclone Remal : రీమాల్ తుఫాన్ తీవ్రతపై సమీక్షిస్తున్న ప్రధాని మోదీ

Leave A Reply

Your Email Id will not be published!