Ex MLA Shakeel: బీఆర్ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్
బీఆర్ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్
Ex MLA Shakeel : బీఆర్ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజాభవన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఆయనపై గతంలో లుకౌట్ నోటీసులు జారీ చేసారు. దీనితో గత కొన్ని నెలలుగా షకీల్(Ex MLA Shakeel) దుబాయ్‌లో ఉంటున్నారు. అయితే తన తల్లి అనారోగ్యంతో మృతి చెందగా… అంత్య క్రియల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన షకిల్ ను ఎయిర్ పోర్ట్ లోనే అదుపులోనికి తీసుకున్నారు. అయితే తల్లి అంత్యక్రియల కోసం మాజీ ఎమ్మెల్యేకు పోలీసులు అనుమతిచ్చారు. అంత్యక్రియలు అనంతరం మాజీ ఎమ్మెల్యే షకీల్ ను అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించే అవకాశం ఉంది.
Ex MLA Shakeel Arrest
కొన్ని నెలల క్రితం షకీల్ కుమారుడు సాహిల్ కారును వేగంగా నడుపుతూ ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు నుంచి కుమారుడిని తప్పించేందుకు మాజీ ఎమ్మెల్యే ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పంజాగుట్ట పోలీసులను మేనేజ్ చేసి తన కుమారుడిని కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేశారంటూ షకీల్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనితో అతనిపై కూడా కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఆయనపై గతంలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. దీనితో కేసు నమోదు విషయం తెలిసిన షకీల్ ఇండియాకు రాకుండా దుబాయ్ లోనే ఉండిపోయారు. అయితే తన తల్లి మరణవార్త తెలుసుకుని ఇండియాకు వచ్చిన షకీల్ ను ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడకు చేరుకుని షకీల్‌ను అరెస్ట్ చేశారు.
Also Read : Wine Shops: జంట నగరాల మందు బాబులకు షాక్ ! శనివారం వైన్ షాపులు బంద్ !