Vemula Veeresham : కేసీఆర్ వ్యవహారం వీరేశం ఆగ్రహం
నన్ను మనిషిగా చూడలేదని ఆరోపణ
Vemula Veeresham : నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఆయన ఏకంగా ఆ పార్టీ చీఫ్ , తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను మనిషిగా కూడా కేసీఆర్ చూడ లేదని వాపోయారు. ఇన్నాళ్లుగా తాను తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తానని అన్నారు.
Vemula Veeresham Slams KCR
శుక్రవారం వేముల వీరేశం మీడియాతో మాట్లాడారు. తనపై పోలీస్ కేసులు పెడుతున్నా, తన అనుచరులను వేధింపులకు గురి చేస్తున్నా కేసీఆర్ మౌనంగా ఉన్నారని , ఏమీ చేయలేక పోయారంటూ ఆరోపించారు. ఇక ఎందుకు పార్టీలో ఉండాలని ప్రశ్నించారు.
సభ్యత్వానికి, పార్టీకి గుడ్ బై చెబుతున్నానంటూ స్పష్టం చేశారు. ఆత్మను చంపుకుని బతకాల్సిన అవసరం తనకు లేదన్నారు. దయనీయ పరిస్థితుల్లో వీడాల్సి వస్తోందన్నారు వేముల వీరేశం(Vemula Veeresham). రానునున్న అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉండగా తాజాగా సీఎం కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల జాబితాలో చివరి దాకా టికెట్ ఆశించారు వీరేశం. కానీ ఉన్నట్టుండి సీఎం ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో అసమ్మతి రేగింది. పార్టీని వీడేలా చేసింది.
Also Read : Chandrayan-3 Comment : చంద్రుడి చెంతకు చంద్రయాన్-3