PAK EX-PM Imran Khan likely Arrest : ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కు రంగం సిద్దం

పాకిస్తాన్ లో జోరుగా ప్ర‌చారం

PAK EX-PM Imran Khan likely Arrest : పాకిస్తాన్ మాజీ ప్ర‌ధాన మంత్రి, మాజీ పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కు కాలం క‌లిసి రావ‌డం లేదు. గ‌తంలో పీఎంగా ఉన్న ఆయ‌న అవిశ్వాస తీర్మానం ద్వారా ప‌ద‌విని కోల్పోయాడు. ఇదే స‌మ‌యంలో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నాడు. పాకిస్తాన్ ఫెడ‌ర‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) , పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ చైర్మ‌న్ అయిన ఇమ్రాన్ ఖాన్(PAK EX-PM Imran Khan) ను నిషేధిత కేసులో అరెస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని పాకిస్తాన్ వార్తా ఛాన‌ల్ ఏఆర్వై న్యూస్ వెల్ల‌డించింది.

అరెస్ట్ కోసం న‌లుగురు స‌భ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. తుది ఆమోదం కోసం డీజీ ఎఫ్ఐఏకు పంపినట్లు నివేదిక కోరింది. అంత‌కు ముందు ఫెడ‌ర‌ల్ ఏజెన్సీ ఇమ్రాన్ ఖాన్ , మ‌రో 10 మందిపై విదేశీ నిధుల‌ను స్వీక‌రించిన ఆరోప‌ణ‌ల‌పై కేసు న‌మోదు చేసింది.

ఎఫ్ఐఏ కార్పొరేట్ బ్యాంకింగ్ స‌ర్కిల్ ద్వారా కేసు న‌మోదు చేశారు. ఇమ్రాన్ ఖాన్ తో పాటు మ‌రికొంద‌రు విదేశీ మారక ద్ర‌వ్య చ‌ట్టాన్ని ఉల్లంఘించార‌ని , నామినేట్ చేయ‌బ‌డిన వారంతా కేసు ప్ర‌కారం ప్రైవేట్ బ్యాంకు ఖాతాదారులేన‌ని పేర్కొంది.

2014లో పార్టీ ఫండింగ్ లో తీవ్ర‌మైన ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని ఆరోపిస్తూ పీటీఐ వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు అక్బ‌ర్ ఎస్ బాబ‌ర్ మొద‌ట కేసు పెట్టారు. ఈ కేసు త‌ర్వాత ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని పార్టీ ప్ర‌క‌టించింది. కాగా పార్టీ ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని త‌ర్వాత ప్ర‌క‌టించింది. 2018లో విచార‌ణ పూర్త‌యింది. నాలుగు ఏళ్ల త‌ర్వాత 2022లో త‌న నివేదిక‌ను స‌మ‌ర్పించింది. పార్టీ నాయ‌క‌త్వం నిధుల చ‌ట్టాల‌ను తీవ్రంగా ఉల్లంఘించందంటూ పేర్కొంది. దీంతో ఇమ్రాన్ అరెస్ట్(Arrest)  కు రంగం సిద్ద‌మైంది.

Also Read : జార్జ్ సోరోస్ పై జై శంక‌ర్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!