GN Sai Baba : మాజీ ప్రొఫెస‌ర్ సాయిబాబ నిర్దోషి – కోర్టు

మావోయిస్ట్ ల‌తో సంబంధాలు లేవు

GN Sai Baba : సుదీర్ఘ పోరాటం ఫ‌లించింది. తీవ్ర అనారోగ్యంతో చావుకు ద‌గ్గ‌ర‌గా ఉన్న మాజీ ఢిల్లీ ప్రొఫెస‌ర్ సాయిబాబకు ఎట్ట‌కేల‌కు ఊర‌ట ల‌భించింది. ఇన్నేళ్లుగా ఏ అభియోగాలు మోపి చెరసాల‌లో ఉంచారో అవ‌న్నీ ఉట్టివేన‌ని తేలింది. ఈ విష‌యాన్ని కోర్టు స్ప‌ష్టం చేసింది. సాయి బాబ నిర్దోషి అని తీర్పు చెప్పింది.

నిషిద్ధ మావోయిస్టుల (న‌క్స‌లైట్లు)తో సంబంధాలు ఉన్నాయ‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న్ను అరెస్ట్ చేశారు. శుక్ర‌వారం ముంబై హైకోర్టుకు చెందిన నాగ‌పూర్ బెంచ్ ఆ కేసులో మాజీ ప్రొఫెస‌ర్ సాయిబాబ‌ను(GN Sai Baba) నిర్దోషిగా తేల్చింది. వెంట‌నే ఆయ‌న‌ను జైలు నుంచి విడుద‌ల చేయాల‌ని ఆదేశించింది.

ఈ కేసును జ‌స్టిస్ రోహిత్ డియో, అనిల్ ప‌న్స‌రేల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ సంచ‌ల‌న తీర్పు చ‌చ‌చెప్పింది. 2017లో ట్ర‌య‌ల్ కోర్టు సాయిబాబ‌ను దోషిగా తేల్చి జీవిత ఖైదు ఖ‌రారు చేసింది. ఆ తీర్పును స‌వాల్ చేస్తూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు బాధితుడు. తాను ఎలాంటి నేరానికి పాల్ప‌డ లేద‌ని, దేశ వ్య‌తిరేక కార్యక‌లాపాల‌లో పాల్గొన‌లేద‌ని పేర్కొన్నారు.

జైలులో ఉండ‌డం వ‌ల్ల త‌న ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తిన్న‌ద‌ని తాను వీల్ చైర్ పై న‌డ‌వ‌లేని స్థితిలో ఉన్నాన‌ని తెలిపాడు. వెంట‌నే త‌న‌కు విముక్లి క‌ల్పించాల్సిందిగా పిటిష‌న్ లో కోరారు సాయిబాబ. ప్ర‌స్తుతం ఆయ‌న నాగ‌పూర్ లోని సెంట్రల్ జైలులో శిక్ష‌ను అనుభ‌విస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా ఇదే కేసుతో లింకు క‌లిగి ఉన్న మ‌రికొంద‌రిని కూడా నిర్దోషులుగా ప్ర‌క‌టించింది ధ‌ర్మాస‌నం. ప్ర‌స్తుతం కోర్టు ఇచ్చిన తీర్పు క‌ల‌క‌లం రేపింది. హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌కు, ప్ర‌జా సంఘాల‌కు ఒక ర‌కంగా బ‌లాన్ని ఇచ్చే తీర్పుగా భావించ‌వ‌చ్చు.

Also Read : రాజీవ్ హంత‌కుల విడుద‌ల‌కు స‌ర్కార్ ఓకే

Leave A Reply

Your Email Id will not be published!