Sadhu Dharamsot : పంజాబ్ మాజీ మంత్రి ధ‌ర‌మ్ సోత్ అరెస్ట్

అవినీతికి పాల్ప‌డితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్న సీఎం

Sadhu Dharamsot : పంజాబ్ లో ఎవ‌రు అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డినా వ‌దిలి పెట్టే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్. ఆయ‌న ఏకంగా త‌న కేబినెట్ లో ఉన్న మంత్రి విజ‌య్ సింగ్లాను తొల‌గించారు.

2015లో ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అవినీతి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో మంత్రిని తొల‌గించారు. ఈ ఏడాది పంజాబ్ సీఎం తీసుకున్న నిర్ణ‌యం రెండోది. దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఇది కొత్త మ‌లుపుగా భావించ‌క త‌ప్ప‌దు.

తాజాగా అమ‌రీంద‌ర్ సింగ్ ప్ర‌భుత్వంలో సాంఘిక సంక్షేమ, అట‌వీ శాఖ‌ మంత్రిగా ప‌ని చేసిన ధ‌ర‌మ్ సోత్(Sadhu Dharamsot) ను రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో అరెస్ట్ చేసింది. గ‌త నెల‌లోనే సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు సీఎం.

అవినీతి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి సాధు సింగ్ ధ‌ర‌మ్ సోత్ ను మంగ‌ళ‌వారం అరెస్ట్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు పోలీసులు.

అమ్లోహ్ లో ఉన్న ఆయ‌న‌ను అదుపులోకి తీసుకుంది రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో. గ‌త వారం జిల్లా అట‌వీ శాఖ అధికారి గుమ‌న్ ప్రీత్ సింగ్ , కాంట్రాక్ట‌ర్ హ‌రీంద‌ర్ సింగ్ హమ్మీని అరెస్ట్ చేశారు.

వీరిని అదుపులోకి తీసుకున్న అనంత‌రం వారిచ్చిన స‌మాచారం మేర‌కు ధ‌ర‌మ్ సోత్(Sadhu Dharamsot) ను ప‌క్కా ఆధార‌ల‌తో అరెస్ట్ చేశారు. క‌మ‌ల్ జిత్ సింగ్ ను కూడా అరెస్ట్ చేసింది.

ఆయ‌న కాంగ్రెస్ నాయ‌కుడికి సన్నిహితుడిగా ఉన్నారు. అవినీతికి వ్య‌తిరేకంగా త‌న ప్ర‌భుత్వం జీరో టాల‌రెన్స క‌లిగి ఉంద‌ని సీఎం భ‌గ‌వంత్ మాన్ ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు.

Also Read : కామెంట్స్ క‌ల‌క‌లం ముస్లిం దేశాల ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!