Raghuram Rajan Rahul : రాహుల్ యాత్రలో ర‌ఘురామ్ రాజ‌న్

పాల్గొన్న మాజీ ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్

Raghuram Rajan Rahul : ప్ర‌పంచ ఆర్థిక రంగంలో మోస్ట్ పాపుల‌ర్ గా పేరొందారు ర‌ఘురామ్ రాజ‌న్. ఆయ‌న గతంలో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గ‌వ‌ర్న‌ర్ గా ప‌ని చేశారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో రాజ‌స్థాన్ లో కొన‌సాగుతున్న రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌లో ర‌ఘురామ్ రాజ‌న్ పాల్గొన్నారు. రాహుల్ తో క‌లిసి అడుగులో అడుగులు వేశారు.

ప్ర‌స్తుతం రాజ‌న్ పాల్గొన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇదే ఇవాళ సోష‌ల్ మీడియాలో హైలెట్ గా నిలిచింది. దేశం ప‌ట్ల ప్రేమ‌తో పాటు గౌర‌వం క‌లిగి ఉన్న ఆర్థిక వేత్త‌గా గుర్తింపు పొందారు రఘురామ్ రాజ‌న్(Raghuram Rajan). ఇక ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఆధ్వ‌ర్యంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం ఆయ‌న‌ను కంటిన్యూ చేసేందుకు ఒప్పుకోలేదు.

ఎందుకంటే ర‌ఘురామ్ రాజ‌న్ వ్యాపార‌వేత్త‌లు, కార్పొరేట్ల‌కు, బ‌డా బాబుల‌కు వ‌త్తాసు ప‌లికేందుకు ఇష్ట ప‌డ‌లేదు. అంతే కాదు సామాన్యులు, పేద ప్ర‌జ‌ల ప‌ట్ల త‌న అభిమానాన్ని చాటుకున్నారు. మోదీ అనుస‌రిస్తున్న పాల‌సీ విధానాల‌ను ఎండ‌గ‌డుతూ వ‌చ్చారు. నోట్ల ర‌ద్దును ఆయ‌న తీవ్రంగా విమ‌ర్శించారు.

ఒక ర‌కంగా నిప్పులు చెరిగారు. భార‌త దేశ ఆర్థిక వృద్ది, ఆర్థిక లోటుపై గ‌తంలో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు ర‌ఘురామ్ రాజ‌న్. ఆయ‌న ఇటీవ‌ల రాసిన పుస్త‌కంలో మోదీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. ఇది పూర్తిగా దేశం మ‌రింత దిగ‌జారేందుకు దోహ‌దం చేస్తోందంటూ హెచ్చ‌రించారు ర‌ఘురామ రాజ‌న్.

స్వ‌ల్ప కాలిక ఆర్థిక ఖ‌ర్చులు దాని నుండి వ‌చ్చే దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాల కంటే ఎక్కువ‌గా ఉంటాయ‌ని భావించిన‌ట్లు పేర్కొన్నారు ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్.

Also Read : డ‌బ్ల్యుహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ గా జెరెమీ ఫ‌ర్రార్

Leave A Reply

Your Email Id will not be published!