HD Kumara Swamy : కేసీఆర్ కుమార స్వామి భేటీపై ఉత్కంఠ
జాతీయ పార్టీ ఏర్పాటుపై సమాలోచన
HD Kumara Swamy : తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్, సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించేందుకు పావులు కదుపుతున్నారు. దేశ వ్యాప్తంగా భావ సారూప్యత కలిగిన పార్టీలు, మేధావులు, నేతలు, రాజకీయ వ్యూహకర్తలతో సమాలోచనలు జరుపుతున్నారు.
కేంద్రంలో కొలువు తీరిన మోదీ, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయం కావాలని కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టేందుకు రెడీ అయ్యారు.
ఇందులో భాగంగా ఇప్పటికే యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ , కర్ణాటక మాజీ సీఎం హెచ్ డి కుమార స్వామి(HD Kumara Swamy), బీహార్ సీఎం నితీశ్ కుమార్ , డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ , మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ , బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ను కలిశారు.
ఇప్పటికే మాజీ ప్రధాన మంత్రి హెచ్ డి దేవగౌడను కూడా కలిసి తనకు మద్ధతు ఇవ్వాలని కోరారు. ఆదివారం మాజీ సీఎం కుమార స్వామి హైదరాబాద్ కు రానున్నారు.
ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ తో(CM KCR) భేటీ కానున్నారు. జాతీయ రాజకీయాలు, చోటు చేసుకున్న పరిణామాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.
రాబోయే 2024 ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అక్టబర్ 5న జరుపుకోనున్న దసరా సందర్భంగా కొత్త పార్టీని ప్రారంభించాలని భావిస్తున్నారు.
దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు తాము ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు కేసీఆర్.
Also Read : స్పష్టత తప్ప ఘర్షణ కోసం కాదు – థరూర్