Hijab Row : క‌ర్ణాట‌క హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

ముంద‌స్తుగా విద్యా సంస్థ‌ల మూసివేత‌

Hijab Row : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన హిజాబ్ వివాదంపై క‌ర్ణాట‌క హైకోర్టు ఇవాళ తుది తీర్పు వెలువ‌రించ‌నుంది. యావ‌త్ దేశ‌మంతా ఆ తీర్పుపై ఉత్కంఠ‌తో ఎదురు చూస్తోంది.

ఇప్ప‌టికే ప‌లు చోట్ల కేసులు, దాడులు కొన‌సాగాయి. ఇరు వ‌ర్గాలు సంయ‌మ‌నం పాటించాల‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. దుస్తులు ధ‌రించ‌డం అన్న‌ది వారి వ్య‌క్తిగ‌త విష‌య‌మ‌ని కానీ ప్ర‌భుత్వం నిర్వ‌హించే విద్యా సంస్థ‌ల‌లో ఆయా యాజ‌మాన్యాలు లేదా స‌ర్కార్ జారీ చేసే ఉత్త‌ర్వులే అంతిమ‌మ‌ని స్ప‌ష్టం చేసింది.

దీనిని స‌వాల్ చేస్తూ కొంద‌రు కోర్టులో దావా వేశారు. ఇప్ప‌టికే వివాదం రాజు కోవ‌డంతో క‌ర్ణాట‌క‌లో అల్ల‌ర్లు (Hijab Row)జ‌ర‌గ‌కుండా ముంద‌స్తుగా భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు.

ఇవాళ బెంగ‌ళూరులో విద్యా సంస్థ‌ల‌ను మూసి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న‌లు, స‌మావేశాలు నిర్వహించ రాద‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ మేర‌కు పోలీసులు భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న హిజాబ్ వివాదం(Hijab Row) నిషేధంపై కోర్టు తీర్పును ప్ర‌క‌టించ‌నుంది.

మంగ‌ళూరులో ఈనెల 15 నుంచి 19 వ‌ర‌కు స‌మావేశాలు నిర్వ‌హించడం పై నిషేధం విధించింది స‌ర్కార్. ఉడిపి జిల్లా యంత్రాంగం ఇవాళ అన్ని పాఠ‌శాల‌లు, కాలేజీల‌కు సెల‌వు ప్ర‌క‌టించింది.

విద్యా సంస్థ‌ల్లో హిజాబ్ నిషేధించ‌డాన్ని స‌వాల్ చేస్తూ ఉడిపికి చెందిన పేరెంట్స్ బృందం కోర్టును ఆశ్ర‌యించింది. ఇదిలా ఉండ‌గా సంస్థాగ‌త క్ర‌మ‌శిక్ష‌ణ‌కు లోబ‌డి స‌హేతుక‌మైన ప‌రిమితులు త‌ప్ప దేశంలో హిజాబ్ ధ‌రించ‌డంపై ఎటువంటి ప‌రిమితి లేద‌ని ప్ర‌భుత్వం హైకోర్టుకు విన్న‌వించింది.

Also Read : ఎన్నిక‌ల్లో అప‌జ‌యం అంద‌రం బాధ్యులం

Leave A Reply

Your Email Id will not be published!