Maharashtra MLC Elections : మరాఠాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు
నువ్వా నేనా అంటున్న ఎన్సీపీ..బీజేపీ
Maharashtra MLC Elections : మరాఠాలో రాజ్యసభ ఎన్నికల వేడి ముగియక ముందే మరో యుద్ధానికి సన్నద్దమయ్యాయి అధికారంలో ఉన్న ఎన్సీపీ, భారతీయ జనతా పార్టీ. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది.
ఇటీవల ఆరు రాజ్యసభ సీట్లకు గాను మూడు సీట్లు ఎన్సీపీ గెలుపొందగా మూడు సీట్లను బీజేపీ చేజిక్కించుకుంది. ఆరో సీటును అనూహ్యంగా శివసేన అభ్యర్థి ఓటమి పాలయ్యారు.
ఇది కోలుకోలేని దెబ్బ. తాజాగా మహారాష్ట్రలో 10 లెజిస్లేటివ్ కౌన్సిల్ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానాలకు 11 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
మహా వికాస్ అఘాడి (ఎంవిఏ మిత్రపక్షాలు) కి చెందిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులను నిలబెట్టాయి. బీజేపీ ఐదుగురు అభ్యర్థులను ప్రతిపాదించింది.
రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుత బలాన్ని బట్టి 9 మంది అభ్యర్థులు విజయం సాధించడం కాయం. కాగా 10వ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన ముంబై చీఫ్ భాయ్ జగ్ తాప్ , బీజేపకి చెందిన ప్రసాద్ లాడ్ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది.
జూన్ 10న ఆరు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తొలి రౌండ్ లో ఆధిక్యంలో ఉన్న శివసేన ఊహించని రీతిలో రెండో అభ్యర్థి సంజయ్ పవార్ బీజేపీ అభ్యర్థి ధనంజయ్ మహదిక్ చేతిలో ఓటమి పాలయ్యారు.
ఇది కోలుకోలేని దెబ్బ. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలపై(Maharashtra MLC Elections) ఫుల్ ఫోకస్ పెట్టారు శివసేన చీఫ్, సీఎం ఉద్దవ్ ఠాక్రే. బీజేపీ వ్యూహాలను దెబ్బకొట్టి తమ సత్తా చాటాలని ముందుగానే నిర్ణయించారు.
ఈ మేరకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర శాసన మండలి ఎన్నికల వ్యూహంపై చర్చించారు.
Also Read : అపోహలు వీడండి ‘అగ్నిపథ్’ లో చేరండి