AICC Chief : కాంగ్రెస్ చీఫ్ ఎన్నికపై ఉత్కంఠ
రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంక గాంధీ
AICC Chief : 134 ఏళ్ల సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని రీతిలో ఉత్కంఠను ఎదుర్కొంటోంది. సరైన నాయకత్వ లేమి ఆ పార్టీని ఇప్పుడు పట్టి పీడిస్తోంది.
రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఎవరనే దానిపై లేవనెత్తిన ప్రశ్నలకు సరైన సమాధానం ఈరోజు వరకు లేదు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ చీఫ్ గా ఎన్నికైనా ఎప్పుడూ లేనంతగా పార్టీ గ్రాఫ్ పడి పోయింది.
సీట్ల సంఖ్య 50కి మాత్రమే పరిమితం కావడం విస్తు పోయేలా చేసింది. మరో వైపు రెండోసారి కొలువు తీరిన బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది.
రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఆయన తల్లి 75 ఏళ్ల వయస్సు కలిగిన సోనియా గాంధీ చీఫ్ గా కొలువు తీరారు. ఇది తాత్కాలికమే.
ఆనాటి నుంచి నేటి దాకా కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ప్రధానంగా కీలకమైన నాయకులు పార్టీని వీడారు. మరికొందరు గులాం నబీ ఆజాద్ సారథ్యంలో తిరుగుబావుటా ఎగుర వేశారు.
గుజరాత్ లోని ఉదయ్ పూర్ లో ఇటీవలే చింతన్ బైటక్ జరిగింది. కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. కానీ ఈరోజు వరకు పార్టీని ఎవరు నియంత్రిస్తున్నారనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేక పోతోంది.
ఈ తరుణంలో కొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవికి ఎన్నిక(AICC Chief) జరగనుంది. బరిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉన్నప్పటికీ అనారోగ్యం కారణంగా సోనియా మరోసారి ఉండక పోవచ్చు.
రాహుల్ దూకుడు పెంచినా ఎందుకనో గాంధీయేతర వ్యక్తులకే పట్టం కట్టాలని అనుకుంటోంది. ఈ తరుణంలో ప్రియాంక గాంధీ నా లేక రాహులా అన్నది తేలాల్సి ఉంది.
Also Read : మునుగోడు సభకు ట్రబుల్ షూటర్