AG Perarivalan : ఉరి శిక్ష సమస్యకు పరిష్కారం కాదు
విడుదలైన ఏజీ పెరరివాలన్ కామెంట్
AG Perarivalan : రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన దోషిగా తేల్చిన, 31 ఏళ్ల పాటు శిక్షను అనుభవించి విడుదలైన ఏజీ పెరివాలన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయనను విడుదల చేయాలని భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం ఆదేశించింది.
కొద్ది సేపటి కిందటే విడుదలైన ఏజీ పెరరివాలన్(AG Perarivalan) మాట్లాడాడు. ఉరి శిక్ష అన్ని సమస్యలకు పరిష్కారం కాదన్నారు. ఉరి శిక్ష అవసరం లేదని తాను గట్టిగా నమ్ముతున్నట్లు చెప్పాడు.
కేవలం దయ కోసమే కాదు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సహా పలువురు జడ్జీలు ఇదే విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు.
అందరూ మనుషులేనని మరోసారి స్పష్టం చేశారు పేరరివాలన్ తన తల్లి అర్పుతమ్మాల్ , బంధువులతో కలిసి పై విధంగా వ్యాఖ్యానించారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో పెరరివాలన్(AG Perarivalan) కు మొదట మరణ శిక్ష విధించారు. ఆ తర్వాత జీవిత ఖైదుగా మార్చారు.
జైలులో ఆయన ప్రవర్తన, వైద్య పరిస్థితి, విద్యార్హతలు, దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అతడి క్షమాభిక్ష పిటిషన్ ను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు విడుదల చేయాలని ఆదేశించింది.
తాను మొదట ఊపిరి తీసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. 31 ఏళ్లుగా న్యాయ పోరాటం చేసినందుకు దక్కిన ఫలితమని పేర్కొన్నాడు. నాకు మాట్లాడేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరాడు.
ఎందరో మద్దతు ఇచ్చారు. వారందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా స్వాగతించారు. న్యాయం – చచట్టం – రాజకీయం – పరిపాలన చరిత్రలో ఈ తీర్పు నకు స్థానం లభిస్తుందన్నారు.
రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై కూడా స్పందించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎల్. నాగేశ్వర్ రావు, బీ.ఆర్. గవాయిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.
Also Read : హార్దిక్ స్వరం బీజేపీ రాగం