5G 13 Cities : 13 న‌గ‌రాల‌లో 5జీ సేవ‌ల విస్త‌ర‌ణ

ఒక‌ట‌వ ద‌శ‌లో విస్త‌ర‌ణ‌కు ప్లాన్

5G 13 Cities : దేశంలో ఇప్ప‌టికే కేంద్రం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన 5జీ స్పెక్ట్ర‌మ్ వేలం ముగిసింది. బిడ్ లో ద‌క్కించుకున్న రిల‌య‌న్స్ జియో, ఎయిర్ టెల్ , వొడా ఫోన్ ఐడియాతో పాటు గౌతం అదానీ నెట్ వ‌ర్క్ కూడా రంగంలోకి దిగ‌డం విశేషం.

కాగా త‌మ సంస్థ‌ల‌కు సంబంధించి అవ‌స‌రం ఉంటుంద‌ని క‌నుక తాము 5జీ బిడ్ లో పాల్గొన్నామ‌ని అదానీ నెట్ వ‌ర్క్ వెల్ల‌డించింది.

ఇక ఇప్ప‌టికే టెలికాం రంగాన్ని శాసిస్తూ వ‌స్తున్నాయి రిల‌య‌న్స్ జియో, ఎయిర్ టెల్. మ‌రో వైపు భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్ ) ను కుప్ప కూల్చారు. కావాల‌నే గ‌త ప్రభుత్వాలు ప్ర‌స్తుత పాల‌క‌లు.

గ‌తంలో ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను కాపాడుకుంటూ వ‌స్తే మోదీ నేతృత్వంలో కొలువు తీరిన బీజేపీ ప్ర‌భుత్వం ఏకంగా గంప గుత్త‌గా అమ్ముకుంటూ పోతోంది.

ఇదిలా ఉండ‌గా బిడ్ ద‌క్కించుకున్న టెలికాం కంపెనీల‌న్నీ ప్ర‌స్తుతం 5జీ స‌ర్వీసులు అందించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఈ మేర‌కు ఏర్పాట్ల‌లో మునిగి పోయాయి.

గ‌తంలో 2జీ, 3జీ, 4జీ కంటే అత్య‌ధికంగా వేగ‌వంతంగా డేటా వినియోగం, ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీ ఉంటుంది 5జీ స‌ర్వీసులో. ఇక ఫ‌స్ట్ ఫేజ్ (మొద‌టి విడ‌త ) లో దేశంలోని 13 న‌గ‌రాల‌లో(5G 13 Cities) ఈ సేవ‌లు అంద‌జేసేందుకు సిద్దంగా ఉన్నాయ‌ని ప్ర‌క‌టించాయి.

ముందుగా అహ్మ‌దాబాద్ , బెంగ‌ళూరు, చండీగ‌ఢ్ , చెన్నై , ఢిల్లీ, గాంధీన‌గ‌ర్ , గురుగ్రామ్ , హైద‌రాబాద్ , జామ్ న‌గ‌ర్ , కోల్ క‌తా , ల‌క్నో , ముంబై , పూణేల‌లో 5జీ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి.

Also Read : ఆయిల్ ధ‌ర‌ల ప‌రిమితిపై ఏకాభిప్రాయం అవ‌స‌రం

Leave A Reply

Your Email Id will not be published!