F3 Pre Release : గ్రాండ్ గా ఎఫ్‌-3 ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్

సినిమా విజ‌యం సాధించ‌డం ఖాయం

F3 Pre Release : హైద‌రాబాద్ లో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇప్ప‌టికే రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుని జ‌నాన్ని క‌డుపుబ్బా న‌వ్వించిన ఎఫ్2 మూవీ మ‌రిచిపోక ముందే మ‌రో సీక్వెల్ మూవీ ఎఫ్3 రెడీ అయ్యింది.

క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డినా ఎట్ట‌కేల‌కు మూవీ మేక‌ర్స్ ఈనెల 27న విడుద‌ల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. డేట్ ను కూడా క‌న్ ఫ‌ర్మ్ చేసేశారు. ఇక మిగిలింది న‌వ్వు కోవ‌డ‌మే.

విజ‌య‌వంతమైన సినిమాలు అందించిన ద‌ర్శ‌కుడిగా పేరొందారు అనిల్ రావిపూడి. మంచి ర‌చ‌యిత కూడా. జంధ్యాల త‌ర్వాత ఆయ‌నంత‌టి డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్నాడు.

ఎక్క‌డా బోరు కొట్ట‌కుండా సినిమాను హాయిగా, ఇంటిల్లిపాది ఎంజాయ్ చేసేట్టుగా తీయ‌డంలో మ‌నోడు దిట్ట‌. ఇప్ప‌టికే ఆయ‌న మ‌హేష్ బాబుతో తీసిన స‌రిలేరు నీకెవ్వ‌రు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్.

ఇక ఎఫ్2 గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ గ్రాండ్(F3 Pre Release) గా జ‌రిగింది. నిర్మాత దిల్ రాజు, ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి, న‌టీన‌టులు వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్, మెహ‌రీన్ , ప్ర‌గ‌తి, సునీల్, ఆలీ, పృథ్వీ రాజ్, రాజేంద్ర ప్ర‌సాద్ , త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

విక్ట‌రీ వెంక‌టేశ్ మాట్లాడుతూ నా సినిమా థియేట‌ర్ల‌లో రిలీజై మూడేళ్ల‌వుతోంది. దృశ్యం 2, నార‌ప్ప ఓటీటీలోకి వెళ్లాయి. కొంద‌రు ఫ్యాన్స్ ఇబ్బంది ప‌డ్డారు.

ఇప్పుడు ఎఫ్‌3 వ‌స్తోంది. ఆడియ‌న్స్ ను త‌ప్ప‌క ఆక‌ట్టుకుంటుంద‌న్నాడు. వ‌రుణ్ తేజ్ తో పాటు ప్ర‌తి ఒక్క‌రు బాగా న‌టించార‌ని కితాబు ఇచ్చాడు వెంకీ.

Also Read : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ సింబ‌ల్ టీ గ్లాసు

Leave A Reply

Your Email Id will not be published!