Sheryl Sandberg : ఫేస్ బుక్ కు షరిల్ శాండ్ బర్గ్ గుడ్ బై
కీ ఎగ్జిక్యూటివ్ గా మోస్ట్ పాపులర్
Sheryl Sandberg : సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్ బుక్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. సుదీర్ఘ కాలం పాటు షెరిల్ శాండ్ బర్గ్ సంస్థ ఉన్నతిలో పాలు పంచుకున్నారు. కీ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ లో ఇప్పటి దాకా బాధ్యతలు చేపట్టారు.
తాను ఫేస్ బుక్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు షెరిల్ శాండ్ బర్గ్(Sheryl Sandberg) . సిలికాన్ వ్యాలీలో అత్యంత ప్రభావంతమైన
మహిళల్లో ఒకరుగా ఉన్నారు. ఫేస్ బుక్ అనిశ్చిత భవిష్యత్తు, తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్న తరుణంలో ఆమె తప్పు కోవడం కలకలం రేపింది.
ప్రస్తుతం ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ ఫేస్ బుక్ ను మెటాగా మార్చేశారు. ప్రస్తుతం ఈ మెటా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ శాండ్ బర్గ్ పదవికి గుడ్ బై చెప్పారు.
మెటా సంస్థలో రెండవ అత్యంత శక్తివంతమైన ఎగ్జిక్యూటీవ్ గా ఉన్నారు. ఆమె 14 ఏళ్ల పాటు పని చేశారు. సుదీర్ఘ కాలం పని చేసిన తర్వాత తాను వైదొలగడం చర్చకు దారి తీసింది.
మెటా ఉద్యోగులను ఆందోళనలో పడేసింది. ఇదిలా ఉండగా షెరిల్ శాండ్ బర్గ్(Sheryl Sandberg) వయసు 52 ఏళ్లు. ఇదిలా ఉండగా మెటాకు
రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉందని స్పష్టం చేసింది ఆమె.
కాగా శాండ్ బర్గ్ సంస్థ బోర్డులో కొనసాగే చాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా ప్రపంచంలో పేరొందిన హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకున్నారు.
అత్యంత ప్రభావితమైన వ్యక్తిగా పేరొందారు. షరిల్ శాండ్ బర్గ్ 2008లో ఫేస్ బుక్ లో చేరారు. ఇది ఇప్పటికీ స్టార్టప్ గా ఉంది. బహుళ బిలియన్
డాలర్ల ప్రకటన సామ్రాజ్యంగా అభివృద్ధి చెందడంలో షరిల్ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూ వచ్చింది.
భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదని పేర్కొన్నారు శాండ్ బర్గ్. ఆమె 2013లో వచ్చిన లీన్ ఇన్ – ఉమెన్ , వర్క్ , అండ్ ది విల్ టు లీడ్ అనే
పేరుతో పుస్తకం కూడా వచ్చింది.
Also Read : టెస్లా రిమోట్ బ్రాంచ్ ఆఫీస్ కాదు