Facebook Shock : ట్విట్టర్ బాటలో ఫేస్ బుక్
ఉద్యోగులకు బిగ్ షాక్
Facebook Shock : టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలాన్ మస్క్ ఎప్పుడైతే ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్నాడో షాక్ ల మీద షాక్ లు ఇస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఇదే సమయంలో మస్క్ బాటలోనే మిగతా సోషల్ మీడియా దిగ్గజ కంపెనీలు నడుస్తున్నాయి. తాజాగా టాప్ లో ఉన్న మార్క్ జుకర్ బర్గ్ నేతృత్వంలోని ఫేస్ బుక్ (మెటా)లో కూడా ఎంప్లాయిస్ ను తొలగించేందుకు (Facebook Shock) ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ కొద్ది రోజుల్లోనే వేలాది మందిని వదిలించుకునేందుకు డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి ప్రముఖ అమెరికన్ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించడం కలకలం రేపింది. ఇదిలా ఉండగా మెటా కంపెనీ దీనిని ఖండించ లేదు స్పందించేందుకు నిరాకరించింది.
అంటే అర్థం ఉద్యోగులపై వేటు వేయడం ఖాయమని తేలి పోయింది. ఇప్పటికే మిగతా సోషల్ మీడియా సంస్థల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటోంది ఫేస్ బుక్. ప్రధానంగా మెటాగా మార్చినప్పటి నుండి దాని మార్కెట్ వాల్యూ రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది. ఇప్పటి వరకు మార్కెట్ లో చోటు చేసుకున్న సంక్షోభం దెబ్బకు హాఫ్ ట్రిలియన్ డాలర్ల మేర నష్టాలను చవి చూసింది.
ఈ దెబ్బకు సాధ్యమైనంత వరకు జాబర్స్ ను తొలిగిస్తే బెటర్ అని మెటా భావిస్తున్నట్లు టాక్. ప్రధానంగా చైనాకు చెందిన టిక్ టాక్ , రష్యాకు చెందిన ట్రూ కాలర్ , ఆపిల్ సంస్థ చేసిన మార్పులు, మెటా ఆశించిన మేర ఫలితాలు రాక పోవడం, తదితర ప్రధాన కారణాలు ఫేస్ బుక్ పాలిట శాపంగా మారాయి. దీనికి తోడు ఆర్థిక మాంద్యం ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
Also Read : ప్రవాస భారతీయులకు మస్క్ షాక్