Kumar Sangakkara : పరాజయం కఠినం విజయానికి సోపానం
ఢిల్లీతో పరాజయం అనంతరం సంగక్కర
Kumar Sangakkara : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) లో ప్లే ఆఫ్స్ కోసం పలు జట్లు పోటీ పడుతున్నాయి. ఇప్పటి దాకా రెండు జట్లు ఖరారై పోయాయి.
ఈసారి ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో ఫస్ట్, సెకండ్ ప్లేస్ లో ఉన్నాయి.
ఇప్పటికే అధికారికంగా గుజరాత్ చేరుకుంది. తాజాగా మిగతా రెండు జట్లు ఏవి అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక లీగ్ లో భాగంగా అత్యంత క్లిష్టమైన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చెత్త ప్రదర్శనతో నిరాశ పరిచింది.
ప్రధానంగా జోస్ బట్లర్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్ లాంటి ఆటగాళ్లు అనవసరంగా వికెట్లు పారేసుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్, దేవదత్ పడిక్కల్ మాత్రమే ఆడారు. 20 ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేసింది.
దీంతో మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ దంచి కొట్టారు రాజస్థాన్ ను. 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్. దాంతో మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర(Kumar Sangakkara) మాట్లాడాడు.
ఐపీఎల్ ప్రారంభం నుంచి మనం బాగా ఆడుతున్నాం. ఒక్కోసారి పరిస్థితులు అనుకూలించక పోవచ్చు. ఇదే సమయంలో మనకు దక్కిన ఓటమి నుంచి కూడా మనం పాఠాలు నేర్చుకోవాలి.
అప్పుడే మనం సక్సెస్ సాధించగలం. ఎక్కడ పొరపాట్లు చేశామనేది తెలుస్తుంది. వాటిని పునరావృతం కాకుండా చూసుకుంటే విక్టరీ సునాయసంగా లభిస్తుంది.
మన ముందరున్నది రెండే మ్యాచ్ లు. వాటిలో గెలిస్తేనే నిలవగలం. మరి ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే ఏం చేయాలి పోరాడాలి. ఇదొక్కటే మనందరికీ కావాల్సింది అంటూ హితబోధ చేశాడు కుమార సంగక్కర(Kumar Sangakkara).
ప్రస్తుతం ఆయన అత్యంత కూల్ గా ప్రశాంతంగా జట్టు సభ్యులను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి చెందిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ మేనేజ్ మెంట్ షేర్ చేసింది.
ప్రస్తుతం ఇది నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఓడి పోవడం చాలా ఈజీ అనుకుంటారు కొందరు. కానీ అది తప్పు. అత్యంత కఠినం కూడా. పోరాటమే అత్యంత కష్టతరమైనది. ఇరు జట్లుకు సమాన అవకాశాలు ఉన్నాయి.
ఇద్దరూ కలిసి ఆడేది ఒకే మైదానంలోనే. కానీ ప్రత్యర్థి జట్టు మనకంటే భిన్నంగా ఆడింది. వచ్చిన వాటితో సద్వినియోగం చేసుకుంది. అందుకే మనం ఓడాం వాళ్లు గెలిచారు.
ఇకనైనా మారండి. మళ్లీ లేవండి. మీ శక్తి యుక్తుల్ని సమీకరించండి అని దిశా నిర్దేశం చేశాడు సంగక్కర.
Also Read : సెలెక్టర్ అయితే కార్తీక్ ను ఎంపిక చేస్తా