Falakunama Express Fire : ప్ర‌యాణీకులు సుర‌క్షితం బోగీలు దగ్ధం

త‌ప్పిన పెను ప్ర‌మాదం

Falakunama Express Fire : యాదాద్రి జిల్లాలో శుక్ర‌వారం చోటు చేసుకున్న ఫ‌ల‌క్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు దుర్ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. దీని వెనుక ఏమైనా విద్రోహ చ‌ర్య ఉందా అన్న అనుమానం వ్య‌క్తం అవుతోంది. హౌరా నుంచి సికింద్రాబాద్ కు వ‌స్తున్న ఫ‌ల‌క్ నుమా ట్రైన్ లో ఉన్న‌ట్టుండి పొగలు వ‌చ్చాయి. దీనిని గ‌మ‌నించిన ప్రయాణికులు కొంద‌రు బోగీలో ఉన్న చైన్ ను లాగారు. దీంతో ఉన్న‌ట్టుండి రైలును నిలిపి వేశారు. దీంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఇప్ప‌టికే ఒడిశా ఘ‌ట‌న మ‌రిచి పోక ముందే ఫ‌ల‌క్ నుమా రైలు(Falakunama Express) ప్ర‌మాదానికి గురి కావ‌డం విస్తు పోయేలా చేసింది.

ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో ఏడు బోగీలు బుగ్గి పాల‌య్యాయి. పూర్తిగా ద‌గ్ధ‌మైన బోగీల‌ను బీబీ న‌గ‌ర్ కు త‌ర‌లించారు రైల్వై అధికారులు. ఇదిలా ఉండ‌గా ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారుల‌కు మూడు రోజుల కింద‌ట ఓ బెదిరింపు లేఖ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. హైద‌రాబాద్ – ఢిల్లీ మార్గంలో ఓ ఘ‌ట‌న జ‌ర‌గ బోతోంద‌ని సంత‌కం లేని లేఖ‌లో హెచ్చ‌రించ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.

ఘ‌ట‌న స్థ‌లం నుంచి బోగీల నుంచి దిగిన ప్ర‌యాణీకుల‌ను బ‌స్సుల్లో హైద‌రాబాద్ కు త‌ర‌లించారు. ఇక్క‌డి నుంచి వారిని త‌మ త‌మ సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించే ఏర్పాట్లు చేసింది ద‌క్షిణ మ‌ధ్య రైల్వే. ఇదిలా ఉండ‌గా ఘ‌ట‌న జ‌రిగిన 10 నిమిషాల్లోపే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్క‌డికి చేరుకున్నారు.

Also Read : Janasena Party Meeting : 9న ఏలూరులో జ‌న‌సేన స‌భ

Leave A Reply

Your Email Id will not be published!