Farmers Protest : సాగు చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ ) చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఉద్యమం మళ్లీ మొదటి కొచ్చింది.
చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రధాన మంత్రి మోదీ రైతు నేతలకు ఇచ్చిన హామీలను అమలు పర్చడంలో విఫలమయ్యారంటూ మండి పడుతున్నాయి రైతు సంఘాలు.
రైతులపై అక్రమంగా నమోదు చేసిన కేసులను తొలగించ లేదని, చాలా మంది రైతులు ఇంకా జైళ్లల్లోనే ఉన్నారని వారిని విడుదల చేయాలని, రైతు పోరాటం సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు.
దీంతో మరోసారి ఉద్యమించేందుకు సన్నద్దం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఢిల్లీ లోని గురు ద్వారా రకాబ్ గంజ్ లో జాతీయ రైతు సంఘాల సమాఖ్య మీటింగ్ (Farmers Protest)జరిగింది.
కీలక సమావేశంలో కిసాన్ సంయుక్త మోర్చాలో 80 రైతు సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల బాధ్యులంతా ఈ భేటీకి హాజరయ్యారు. హామీలు నెరవేర్చకుండా కేంద్రం తాత్సారం చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మరోసారి తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని రైతు నేతలు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ , శివ కుమార్ కక్కా హెచ్చరించారు. కేంద్రం కావాలని రైతులను పట్టించు కోవడం లేదని రైతు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ రోజు వరకు తమతో సంప్రదింపులు కూడా జరిపిన పాపాన పోలేదన్నారు. ఇదిలా ఉండగా ఉత్తర ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో రైతు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలనే డిమాండ్ తో ఎస్కేఎం ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టాలని నిర్ణయించింది.
Also Read : వాయనాడ్ లో స్మృతి ఇరానీ టూర్