Farmers Break : బారికేడ్లను ఛేదించిన రైతన్నలు
మహిళా మల్లయోధులకు మద్దతు
Farmers Break : డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద మహిళా మల్లయోధులు నిరసన దీక్ష చేపట్టారు. సంయుక్త కిసాన్ మోర్చా తో పాటు రైతు సంఘాలు రెజ్లర్లకు సంఘీభావం ప్రకటించాయి. రైతుల మద్దతుతో ఢిల్లీ పోలీసులు భారీగా మోహరించారు. వాళ్లు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు.
రెజ్లర్ల వద్దకు భారీగా తరలి వచ్చిన అన్నదాతలను అడ్డుకునేందుకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఢిల్లీ నిరసనలో పాల్గొనేందుకు బారికేడ్లను ఛేదించారు. దాటుకుంటూ వెళ్లి పోయారు. జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది.
తాము రైతులను(Farmers Break) ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదని, కావాలని వాళ్లు బారికేడ్లను దాటుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నం చేశారని ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం ట్వీట్ చేసింది. జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశామని తెలిపింది. తాము ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదని, ఫేక్ వార్తలను నమ్మవద్దని కోరింది. ఇదిలా ఉండగా మల్ల యోధుల వద్దకు పెద్ద ఎత్తున రైతులు చేరుకోవడం తీవ్ర ఉత్కంఠను రేపింది.
ఇదిలా ఉండగా గత నెల ఏప్రిల్ 23న మహిళా రెజ్లర్లు ఢిల్లీలో ఆందోళన బాట పట్టారు. ఒకరు కాదు ఏకంగా 30 మందికి పైగా మల్లయోధులు రోడ్డుపైకి వచ్చారు. తాము లైంగికంగా, శారీరకంగా వేధింపులకు గురవుతున్నామని ఆవేదన చెందారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ ను తొలగించాలని డిమాండ్ చేశారు.
Also Read : ఓట్ల కోసమే ముస్లింల జపం