KCR : రైతులు ప్రభుత్వాల్ని మార్చగలరు – కేసీఆర్
అన్నదాతలు తల్చుకుంటే బతకడం కష్టం
KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులు తల్చుకుంటే ఏమైనా చేయగలరని, వీలైతే ప్రభుత్వాలను కూల్చగలరని అన్నారు.
తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధరను రాజ్యాంగ బద్దంగా అమలు చేసేంత వరకు కేంద్ర ప్రభుత్వంపై ఆందోళన కొనసాగించాలని కేసీఆర్(KCR) పిలుపునిచ్చారు.
దేశ వ్యాప్త పర్యటనలో భాగంగా ఆదివారం పంజాబ్ లో పర్యటించారు. ఆయనతో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు.
గాల్వాన్ లోయ ఘర్షణలో మరణించిన జవాన్లు, గత ఏడాది రైతు వ్యతిరేక చట్టం ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళులు అర్పించేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు.
దేశ వ్యాప్తంగా రైతులు చేసే న్యాయమైన పోరాటానికి తాము బేషరతుగా మద్దతు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ వంటి ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి రైతులకు అండగా ఉంటామని అన్నారు.
ఈ కార్యక్రమానికి రైతు ఉద్యమానికి నాయకత్వం వహించిన భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ కూడా హాజరయ్యారు. రైతుల పట్ల కేంద్రం అమానవీయ ధోరణిని అవలంభిస్తోందని ఆరోపించారు కేసీఆర్(KCR).
వ్యవసాయానికి ఆధారమైన ఎరువుల ధరలు పెరిగాయని, పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా రైతు ఉద్యమ కాలంలో ప్రాణాలు కోల్పోయిన 600 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున పరిహారం అందజేశారు కేసీఆర్.
Also Read : మోదీ సర్కార్ పై కేసీఆర్ కన్నెర్ర