Farmers Lift : దిగొచ్చిన ప్రభుత్వం శాంతించిన రైతాంగం
అక్టోబర్ 1 నుంచి ధాన్యాన్ని సేకరిస్తామని హామీ
Farmers Lift : మరోసారి రైతులు రోడ్డెక్కారు. హర్యానా బీజేపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. ఏకంగా 24 గంటల పాటు హర్యానా హైవేను దిగ్బంధించారు. చివరకు సర్కార్ దిగొచ్చింది. రైతులు పేర్కొన్న డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
దీంతో నిరవధికంగా ఆందోళన బాట పట్టిన రైతాంగం విరమించింది(Farmers Lift). అక్టోబర్ 1వ తేదీన అధికారిక సేకరణ చేయాల్సి ఉన్నప్పటికీ ధాన్యం మార్కెట్ల నుంచి వరి తరలింపు ప్రారంభిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ముందస్తుగా వరి ధాన్యం కొనుగోలు చేయాలని ప్రధాన డిమాండ్ తో నిరసనకు దిగారు రైతులు. బాధిత రైతులు ప్రభుత్వం స్పందించడం లేదంటూ కోర్టును ఆశ్రయించారు.
మనవతా దృక్ఫథంతో తమ ఆందోళనను విరమించాలని , వెంటనే వారి సమస్యను పరిష్కరించాలని హర్యానా బీజేపీ సర్కార్ ను కోర్టు ఆదేశించింది.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని ప్రభుత్వాలు పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని రైతులు ఆరోపించారు. ఇదిలా ఉండగా గత కొన్ని గంటలుగా దిగ్భంధం చేయడంతో 44వ జాతీయ రహదారిపై కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఎక్కడ చూసినా వాహనాలు నిలిచి పోయాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిని సీరియస్ గా పరిగణించింది కోర్టు. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోక పోతే చర్యలు ఉంటాయని హెచ్చరించింది కోర్టు.
ఈ ఆందోళనకు భారతీయ కిసాన యూనియన్ – చారుణి సంస్థ రైతుల ఆందోళనకు నాయకత్వం వహించారు గుర్నామ్ సింగ్ చారుణి.
Also Read : పాపులర్ ఫ్రంట్ పై కర్ణాటక కన్నెర్ర