Farooq Abdullah : ఓట‌ర్ల జాబితాపై ఫ‌రూక్ అబ్దుల్లా ఫైర్

వ్యూహంలో భాగ‌మే స్థానికేత‌రుల ఓట్లు

Farooq Abdullah : జ‌మ్మూ కాశ్మీర్ లో 25 ల‌క్ష‌ల మందికి పైగా స్థానికేత‌రులు ఓట‌ర్లుగా న‌మోదు చేసుకోవ‌డంపై విప‌క్షాలు మండిప‌డుతున్నాయి.

ఈ విష‌యంపై సెప్టెంబ‌ర్ లో జ‌మ్మూ కాశ్మీర్ లో అన్ని జాతీయ పార్టీల నాయ‌కుల‌ను ఆహ్వానిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు మాజీ సీఎం, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ అధ్య‌క్షుడు ఫ‌రూక్ అబ్దుల్లా(Farooq Abdullah) .

సోమ‌వారం శ్రీ‌నగ‌ర్ లోని త‌న నివాసంలో ఇత‌ర రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో క‌లిసి మీడియాతో మాట్లాడారు. జ‌మ్మూ కాశ్మీర్ లో స్థానికేత‌రుల‌ను కూడా ఓట‌ర్లుగా చేర్చ‌డంపై తీవ్ర అభ్యంత‌రం వ్యక్తం చేశారు.

దీనిని అన్ని ప్ర‌తిప‌క్ష పార్టీలు వ్య‌తిరేకిస్తున్నాయ‌ని చెప్పారు. ఈ విష‌యంపై కోర్టును ఆశ్ర‌యించాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

వ‌చ్చే నెల‌లో జ‌మ్మూ , కాశ్మీర్ కు జాతీయ స్థాయిలో ఉన్న అన్ని పార్టీల నాయ‌కుల‌ను ఆహ్వానించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు. ఇవాళ జ‌రిగిన అఖిల‌ప‌క్ష స‌మావేశంలో వెల్ల‌డించారు.

రాష్ట్రంలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై చ‌ర్చించేందుకు అకిల‌ప‌క్ష స‌మావేశాన్ని పిల‌వాల‌ని లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌నోజ్ సిన్హాను క‌లిసి కోరామ‌ని తెలిపారు ఫ‌రూక్ అబ్దుల్లా.

తాము దీనిని అంగీక‌రించే ప్ర‌స‌క్తి లేద‌న్ఆరు. త‌మ‌కు భిన్నాభిప్రాయాలు ఉన్నాయ‌ని, కానీ అసెంబ్లీకి దూరంగా ఉండే ప్ర‌మాదం ఉంద‌న్నారు.

స‌వ‌రించిన ఓట‌ర్ల జాబితాలో ఓట‌ర్ల చేరిక‌పై కేంద్ర పాలిత ప్రాంత చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్ హిర్దేశ్ కుమార్ చేసిన వ్యాఖ్య‌ల‌పై అభ్యంత‌రం తెలిపారు.

ఇదిలా ఉండ‌గా స్థానికేత‌ర ఓట‌ర్ల వ‌ల్ల ఎలాంటి అభ్యంత‌రం లేద‌న్నారు. దీని వ‌ల్ల పార్టీలు భ‌యాందోళ‌న‌కు గురి కావ‌ద్ద‌ని సూచించారు. దీనిపైనే ప్ర‌తిప‌క్షాలు ఫోక‌స్ పెట్టాయి.

Also Read : డ్ర‌గ్స్ స్వాధీనంపై మోదీ మౌన‌మేల – రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!