Farooq Abdullah :వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) తీసిన ది కశ్మీర్ ఫైల్స్ (The Kashmir Files) ఊహించని రీతిలో సక్సెస్ అయ్యింది. రూ. 100 కోట్ల మార్క్ ను ఎప్పుడో దాటేసింది. దీనిపై భిన్నాభిప్రాయాలు దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతున్నాయి.
ఈ మూవీ రాజేసిన అంశాలు ఇప్పుడు చర్చకు దారి తీశాయి. ఈ తరుణంలో శివసేన (Shiv Sena) ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut)ప్రచారం కోసం తప్ప మరొకటి కాదని కామెంట్ చేశారు. ఇదిలా ఉండగా జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) స్పందించారు.
1990లో చోటు చేసుకున్న ఘటనలు, కశ్మీర్ పండింట్ల వలసలు గనుక నిజమని రుజువు చేస్తే తనను ఉరి తీయండని సవాల్ విసిరారు. ఆయన చేసిన ఛాలెంజ్ ఇప్పుడు దేశమంతటా కలకలం రేపింది.
అవాస్తవాలను సినిమా ద్వారా ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. కేవలం మనుషుల మధ్య విభేదాలు సృష్టించడం, రాజకీయంగా లబ్ది పొందడం తప్ప మరొకటి కాదన్నారు.
ఆనాడు పండిట్లు వలస వెళ్లే సమయంలో అప్పటి గవర్నర్ జగన్మోహన్ మల్హోత్రా నే వారిని బస్సులో ఎక్కించి పంపించారంటూ తెలిపారు. తాను ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు శుద్ద అబద్దమన్నారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వాస్తవాలు వెలుగు చూస్తాయని చెప్పారు. ఇదిలా ఉండగా వాస్తవాల ఆధారంగా సినిమా తీయలేదంటూ సీపీఎం నేత బృందా కారత్ అన్నారు.
కాగా దేశంలో ముస్లింలపై జరిగిన హత్యలపై కూడా వివేక్ మూవీ తీయాలన్నారు మరికొందరు. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఈ సినిమా ప్రచారం కోసం తప్ప మరొకటి కాదన్నారు.
Also Read : మోదీపై ప్రకాశ్ రాజ్ సెటైర్