Farooq Abdullah : రాష్ట్రపతి పదవి కంటే రాష్ట్రం ముఖ్యం
విపక్షాల ఉమ్మడి అభ్యర్థిత్వానికి బిగ్ షాక్
Farooq Abdullah : మోదీ నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి గట్టి పోటీ ఇచ్చేందుకు టీఎంసీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేస్తున్న ప్రయత్నాలకు కోలుకోలేని షాక్ తగిలింది.
ఈనెల 15న న్యూఢిల్లీలో దీదీ సారథ్యంలో విపక్షాలు భేటీ అయ్యాయి. ఈ కీలక సమావేశానికి 17 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ మేరకు మొదట ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను ప్రతిపాదించారు.
ఈ సందర్భంగా విపక్షాలు చేసిన ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. తనకు రాష్ట్రపతి పదవిపై ఆసక్తి లేదని సమావేశంలోనే కుండ బద్దలు కొట్టారు. దీంతో మమతా బెనర్జీ సుదీర్ఘ చర్చల అనంతరం ఇద్దరి పేర్లను ప్రతిపాదించారు.
వారిలో మహాత్మా గాంధీ మనుమడు, ప్రముఖ రాజకీయ వేత్త, మాజీ గవర్నర్ గోపాల కృష్ణ గాంధీ తో పాటు జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా పేర్లను ప్రతిపాదించగా అన్ని పార్టీల ప్రతినిధులు ఓకే చెప్పారు.
ఇదిలా ఉండగా శనివారం ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) బాంబు పేల్చారు. తాను రాష్ట్రపతి రేసులో ఉండడం లేదన్నారు. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు.
తానే వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తనకు రాష్ట్రపతి పదవి కంటే రాష్ట్రం ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతం నా సేవలు దేశానికంటే నా రాష్ట్రానికి అవసరమని అనిపిస్తోంది.
అందుకే తాను రాష్ట్రపతి పదవికి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రపతి రేసు నుంచి వైదొలిగినా తన సంపూర్ణ మద్దతు విపక్షాలకు ఉంటుందని స్పష్టం చేశారు మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా(Farooq Abdullah).
Also Read : రాష్ట్రపతి ఎన్నికల్ని సీరియస్ గా తీసుకోవాలి