Fawad Chaudhury : పాకిస్తాన్ (Pakistan) సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి (Fawad Chaudhury) సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటున్నారు.
ఈ తరుణంలో ఫవాద్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ఆర్మీ చీఫ్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను రాజీనామా చేయాలని అడగ లేదన్నారు. ప్రస్తుతం ప్రధాని పార్లమెంట్ లో మెజారిటీ కోల్పోయారు.
విదేశీ శక్తులు కావాలని కుట్ర పన్నుతున్నాయని, ఇమ్రాన్ ఖాన్ ను తొలగించేందుకు విపక్షాలు సైతం ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఫవాద్ చౌదరి(Fawad Chaudhury) ఇవాళ మీడియాతో మాట్లాడారు.
ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా ..ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మధ్య సమావేశానికి సంబంధించి వివరాలు వెల్లడించేందుకు ఇష్ట పడలేదు.
ఆర్మీ చీఫ్ తన రాజీనామా చేయమని అడగ లేదు. ఈ సందర్భంలో ఇమ్రాన్ ఖాన్ తన పదవికి రాజీనామా చేయడు అని స్పష్టం చేయలేదు.
ఇదిలా ఉండగా 73 సంవత్సరాల పాకిస్తాన్ (Pakistan) లో ఆర్మీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాల పాటు ఏ ప్రభుత్వం కొలువు తీరిన సందర్భం లేదు పాకిస్తాన్ లో.
ఫవాద్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను , ప్రధాన మంత్రి (Prime Minister) బలహీనతను 1992లో వరల్డ్ కప్ సమయంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు స్థానంతో పోల్చారు.
ఇదిలా ఉండగా రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఉన్నట్టుండి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిన ఇమ్రాన్ రద్దు చేసుకున్నారు. భద్రతా కారణాల కారణంగానే తప్పుకుంటున్నట్లు పీటీఐ ప్రకటించింది.
Also Read : ఇమ్రాన్ ఖాన్ హత్యకు స్కెచ్