DY Chandrachud : స్త్రీవాద దృక్ఫథం అవసరం – చంద్రచూడ్
ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
DY Chandrachud : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టంతో వ్యవహరించేటప్పుడు స్త్రీవాద దృక్పథాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
మహిళల సామర్థ్యాన్ని భారతీయ సమాజానికి పరివర్తనాత్మకంగా మార్చడం గొప్ప సవాలుగా మారుతుందన్నారు. జస్టిస్ చంద్రచూడ్ నవంబర్ 9న భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. రెండేళ్ల పాటు కొనసాగుతారు సీజేఐగా.
ఢిల్లీ లోని నేషనల్ లా యూనివర్శిటీ (ఎన్ఎల్ యు) స్నాతకోత్సవంలో జస్టిస్ డివై చంద్రచూడ్(DY Chandrachud) పాల్గొని ప్రసంగించారు. సామాజిక, జెండ్ కోడ్ లలో ఉన్న చట్టాలను దాటి ఆలోచించాలని యువ న్యాయవాదులకు సూచించారు.
చట్టం ముందుగా ఉన్న సామాజిక , లింగ సంకేతాలలో పని చేస్తుంది. మీరు చట్టంతో వ్యవహరించే విధానంలో స్త్రీవాద ఆలోచనను చేర్చమని ప్రత్యేకంగా సలహా ఇస్తున్నానని పేర్కొన్నారు జస్టిస్ చంద్రచూడ్.
ఇదిలా ఉండగా బంగారు పతకాలు సాధించిన మహిళా న్యాయవాదులను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇది మనం జీవిస్తున్న కాలానికి , రాబోయే కాలానికి కేవలం సూచిక మాత్రమేనని పేర్కొన్నారు.
మహిళా విద్యార్థుల విజయానికి భారతీయ సమాజంలో ఎదురవుతున్న సవాళ్లే కారణమని అన్నారు. సమాజంలోని మహిళల శక్తిని అద్భుతమైన పరివర్తనలోకి ఎలా మార్చవచ్చో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు జస్టిస్ చంద్రచూడ్.
బాంబే హైకోర్టులో కొత్తగా న్యాయమూర్తిగా చేరిన సమయంలో తన అనుభవాన్ని ఈ సందర్భంగా పంచుకున్నారు. తాను జస్టిస్ రంజన్ పి దేశాయ్ తో పాటు క్రిమినల్ రోస్టర్ లో కూర్చునే వాడినని , విభిన్న క్రమినల్ అప్పీళ్లను విన్నానని తెలిపారు.
Also Read : రూ. 1,317 కోట్ల ఐరియో గ్రూప్ ఆస్తులు అటాచ్