Marriage Function: పెళ్లి పీటలపైనే వధువుకు వరుడి ముద్దు ! కొట్లాటకు దారి తీసిన వరుడి ముద్దు !

పెళ్లి పీటలపైనే వధువుకు వరుడి ముద్దు ! కొట్లాటకు దారి తీసిన వరుడి ముద్దు !

Marriage Function: భారతీయ సాంప్రదాయంలో ముఖ్యంగా హిందూ సమాజంలో పెళ్లికి చాలా ప్రత్యేకత ఉంది. జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే ఈ తంతు కోసం… ముందు ఏడు తరాలు, వెనుక ఏడు తరాలు చూసి పెళ్లి చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే పెళ్లిని చాలా ఘనంగా జరుపుకుంటారు. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొంత పుంతలు తొక్కుతున్న వేళ… సంస్కృతి, సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పెళ్లిని చాలా మంది ఒక ఈవెంట్ లా నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో పెళ్లికి ముందే పెద్ద ఎత్తున ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తున్నారు. పెళ్లి రిసెప్షన్, ఊరేగింపుల్లో పెళ్లికొడుకు, పెళ్ళి కూతురు అని తేడా లేకుండా డ్యాన్స్ లు వేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ పైత్యం మరింత ముదిరిందనే చెప్పుకోవాలి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ పేరిట పెళ్లి కొడుకు, పెళ్ళి కుమార్తె ఇద్దరు ముద్దులు పెట్టుకోవడం, కలిసి బీచ్ లో స్నానం చేయడం వంటివి చాలా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్(UP) లోని హాపూర్ లో ఓ పెళ్ళిలో జరిగిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Marriage Function Viral

ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెల వివాహాలను హాపూర్‌లోని అశోక్‌ నగర్‌ లో ఒకేరోజు ఏర్పాటు చేశారు. ఒక కుమార్తె వివాహం పూర్తయిన కాసేపటికి మరొకరిది ప్రారంభించారు. వరమాల వేయడం పూర్తయిన తర్వాత వరుడు, వధువుకు బహిరంగంగా ముద్దు పెట్టాడు. ఇది ఆమె బంధువులకు నచ్చకపోవడంతో స్టేజీ పైకి చేరుకొని వరుడు, అతడి కుటుంబసభ్యులపైన దాడికి దిగారు. అవతలి వారూ ప్రతిదాడికి దిగడంతో కల్యాణ వేదిక కాస్త రణరంగంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని. గాయపడిన ఏడుగురిని ఆసుపత్రికి తరలించారు. తమ కుమార్తె నిరాకరిస్తున్నా… అందరిముందు ముద్దు పెట్టుకున్నాడని వధువు కుటుంబీకులు ఆరోపించారు. మరోవైపు ఆమె అంగీకారంతోనే ముద్దు పెట్టుకున్నట్లు వరుడు చెప్పడం గమనార్హం. ఈ ఘటనపై రాత పూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, బహిరంగంగా దాడికి పాల్పడినందుకు ఆరుగురిపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం పెళ్ళి పీటలపై ఇరు వర్గాలు కొట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారతున్నాయి.

Also Read : Rahul Gandhi: ఏపీ, తెలంగాణ భవన్‌ లలో రాహుల్‌ గాంధీ సందడి !

Leave A Reply

Your Email Id will not be published!