Rahul Gandhi : రాహుల్ కు ఛాన్స్ ఇస్తే బెటర్ – ఉమైర్
ప్రముఖ జర్నలిస్ట్, అనలిస్ట్ సంధు
Rahul Gandhi : ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు, దక్షిణాసియాలో పేరు పొందిన ఫిలిం జర్నలిస్ట్ లలో ఒకడిగా పేరు పొందిన ఉమైర్ సంధు షాకింగ్ కామెంట్స్ చేశాడు. బుధవారం ఆయన ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఫోటోను షేర్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చూసి అలసి పోయామని ఇక రాహుల్ ను ప్రధానమంత్రిగా చూడాలని కోరిక ఉందని పేర్కొన్నారు ఉమైర్ సంధు.
ఇదిలా ఉండగా ఫిల్మ్ క్రిటిక్ చేసిన ఈ వ్యాఖ్యలు, వ్యక్తం చేసిన అభిప్రాయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం మోదీకి అనుకూలంగా ఓ వర్గం వ్యతిరేకంగా మరో వర్గంగా చీలి పోయాయి భారత దేశంలో. తాజాగా కేంద్రంలోని బీజేపీ సంకీర్ణ సర్కార్ పై సంచలన ఆరోపణలు చేశారు మాజీ ట్విట్టర్ సిఇవో జాక్ డోర్సీ. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అన్నది గాలిలో దీపం లాగా మారిందని ధ్వజమెత్తారు.
రైతుల ఆందోళన సందర్భంగా తమపై తీవ్రమైన ఒత్తిళ్లను తీసుకు వచ్చిందని ఆరోపించారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఆయనతో పాటు ఉమైర్ సంధు కూడా రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితే బెటర్ అని పేర్కొనడం సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా రాహుల్ ప్రధానిపై కామెంట్స్ చేశారంటూ ఎంపీగా అనర్హత వేటు వేసింది సర్కార్. ఇది ఆయనకు బిగ్ అడ్వాంటేజ్ గా మారింది.
Also Read : Nara Lokesh : ఆదరించిన రాయలసీమకు అభివందనం