P Chidambaram : వాళ్లను ప్రేరేపించింది ఎవరో తేల్చండి
కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం
P Chidambaram : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ పి. చిదంబరం(P Chidambaram) షాకింగ్ కామెంట్స్ చేశారు. నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ అసలు ఇస్లామోఫోబియో సృష్టికర్తలు కాదని పేర్కొన్నారు. ఈ ఇద్దరిని భారతీయ జనతా పార్టీ హై కమాండ్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఇస్లామిక్ , గల్ఫ్ , అరబ్ కంట్రీస్ తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలిపాయి. దాయాది పాకిస్తాన్ దేశం అగ్నికి ఆజ్యం పోసింది.
సాక్షాత్తు ఆ దేశ ప్రధాని సైతం ట్విట్టర్ వేదికగా ఖండించారు. దీనిపై బారత్ స్పందించింది. తీవ్రంగా తప్పు పట్టింది. భారత్ లో మైనార్టీ వర్గాలకు పూర్తి రక్షణ ఉందని పేర్కొన్నారు విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి.
ఈ తరుణంలో బీజేపీ నుంచి బహిష్కరించ బడిన లేదా తొలగించబడిన నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ లను మొదటి నుంచి ప్రోత్సహించింది ఎవరో చెప్పాలి. ఈ భావజాలం వారిది కాదు. వారిని ప్రేరేపించిన వారిది.
గత కొంత కాలంగా పనిగట్టుకుని దేశంలో ఎక్కడో ఒక చోట అల్లర్లు చోటు చేసుకుంటున్నాయి. ఇది మంచి పద్దతి కాదు. అలా వారిని నోరు పారేసుకునేలా చేసిన పార్టీ పెద్దలు ఎవరో తేల్చాలన్నారు పి. చిదంబరం(P Chidambaram).
కామెంట్స్ చేయడం దేశం పరువును పోగొట్టేలా చేయడం పరిపాటిగా మారిందన్నారు. వారిద్దరూ రాజు కంటే ఎక్కువ విధేయులుగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు.
ఒక రకంగా అంతర్జాతీయ పరంగా భారత్ కు పెద్ద దెబ్బ అని చిదంబరం పేర్కొన్నారు. సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు.
Also Read : ప్రాణహాని ఉందన్న నూపుర్ శర్మ