Seven Hills Hospital: విశాఖ సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం !
విశాఖ సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం !
Seven Hills Hospital: విశాఖలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రి బిల్డింగ్ లోని ఆరో అంతస్తులో మంటలు చెలరేగడంలో సిబ్బంది, పేషెంట్స్ బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది… మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Seven Hills Hospital Fire Incident..
ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… విశాఖలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రి(Seven Hills Hospital)లో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఆరో అంతస్తులోని అడ్మిన్ బ్లాక్లో మొదట మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ బయటకు రావడంతో ఆసుపత్రిలో ఉన్న రోగులు, వారి బంధువులు, సిబ్బంది బయటకు పరుగులు తీసారు. వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది భవనంలో ఉన్న పేషంట్స్ను బయటకు తరలించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఆసుపత్రిలోకి ఇతర బ్లాక్ల్లోకి మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ప్రమాదంలో రోగులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే విశాఖలో గడచిన 15 రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన. 15 రోజుల క్రితం వెంకోజిపాలేంలోని మెడికవర్ ఆసుపత్రిలో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. దీనితో విశాఖలో అసుపత్రిలో ఫైర్ సేఫ్టీపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
Also Read : Anam Ramanaraya Reddy: కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతులు పునరుద్ధరిస్తాం – మంత్రి ఆనం