Rakesh JhunJhunwala : $4 బిలియ‌న్ల స్టాక్ హోల్డింగ్స్ పై ఫోక‌స్

రాకేశ్ ఝున్ ఝున్ వాలా మ‌ర‌ణం త‌ర్వాత

Rakesh JhunJhunwala : ఇండియ‌న్ వారెన్ బ‌ఫెట్ గా పేరొందిన 62 ఏళ్ల రాకేష్ ఝున్ ఝున్ వాలా ఆక‌స్మిక మ‌ర‌ణం యావ‌త్ భార‌తీయ వ్యాపార , వాణిజ్య రంగాల‌ను కుదిపేసింది.

భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి మోదీతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉండ‌గా కేవలం రూ. 5,000 ల‌తో ఇన్వెస్ట్ మెంట్ ప్రారంభించారు ఝున్ ఝున్ వాలా.

త‌ను చ‌ని పోయే నాటికి త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని రూ. 41,000 వేల కోట్ల‌కు పైగా విస్త‌రించాడు. ఇది ఆయ‌న వ్యాపార విజ్ఞ‌త‌కు నిద‌ర్శ‌నం. ఇక ఆయ‌న ఆక‌స్మిక మ‌ర‌ణం త‌ర్వాత $4 బిలియ‌న్ల స్టాక్ హోల్డింగ్స్ పై ఫోక‌స్ పెట్టింది.

ఎక్క‌డెక్క‌డ ఝున్ ఝున్ వాలా(Rakesh JhunJhunwala) పెట్టుబ‌డి పెట్టార‌నే దానిపై ప‌రిశీలించారు. ఆయ‌న ఎన్నో కంపెనీలు ఏర్పాటు చేశాడు. కొన్నింటికి గౌర‌వ చైర్మ‌న్ గా ఉన్నారు.

మ‌రికొన్ని సంస్థ‌ల‌కు బోర్డ్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు. అంతే కాకుండా భ‌విష్య‌త్తులో మ‌రింత రాబ‌డి క‌లిగి ఉండే స్టార్ట‌ప్ (అంకురాలు)ల‌పై కూడా ఫోక‌స్ పెట్టాడు.

వాటిలో కూడా ఇన్వెస్ట్ చేశాడు. స్టాక్ లు కొనుగోలు చేశాడు. రాకేష్ ఝున్ ఝున్ వాలా ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి కూడా ప్ర‌వేశించారు. ఆకాస ఎయిర్ లైన్స్ లో భాగ‌స్వామిగా ఉన్నారు.

ఇక రాకేష్ ఆసియా స్టాక్ మార్కెట్ వ్య‌వ‌స్థ‌లో అత్యంత ప్ర‌భావంత‌మైన వ్యాపార వేత్త‌గా ఉన్నారు. దేశంలోని అత్యంత ధ‌న‌వంతుల జాబితాలో ఝున్

ఝెన్ వాలా కూడా ఒక‌రుగా గుర్తింపు పొందారు.

ఆయ‌న భార్య రేఖా ఝున్ ఝున్ వాలా కీల‌క‌మైన వ్య‌క్తిగా ఉన్నారు. మార్కెట్ వాల్యూ ప్ర‌కారం స్టార్ హెల్త్ , ఫుట్ వేర్ మేక‌ర్ మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ , ఆటో మేక‌ర్ టాటా మోటార్స్ లిమిటెడ్ ఉన్నాయి.

ఇదిలా ఉండ‌గా మోదీ ఝున్ ఝున్ వాలా ఆర్థిక ప్ర‌పంచానికి చెర‌గ‌ని స‌హ‌కారం అందించారంటూ పేర్కొన్నారు.

Also Read : ఖాతాదారుల‌కు ఎస్బీఐ ఝ‌ల‌క్

Leave A Reply

Your Email Id will not be published!