DGCA Enhance : విమానాల‌లో సెక్యూరిటీ పెంపుపై ఫోక‌స్

ఆధునిక నిఘా వ్య‌వ‌స్థ ఏర్పాటు అవ‌స‌రం

DGCA Enhance : మారుతున్న టెక్నాల‌జీకి అనుగుణంగా మ‌రింత ఆధునిక భ‌ద్ర‌త‌ను మెరుగు ప‌ర్చాల్సిన అవ‌సరం ఉంద‌ని స్ప‌ష్టం చేసింది డీజీసీఏ. ట్రైనీ పైల‌ట్లు, బోధ‌కుల‌కు వీటిపై అవ‌గాహ‌న ఉండాల‌ని పేర్కొంది. ఇందులో భాగంగా ఎయిర్ పోర్ట్ ల‌తో పాటు ఆయా విమానయాన సంస్థ‌లు క‌ట్టుదిట్ట‌మైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డింది.

శిక్షణా కార్య‌క‌లాపాల‌ను ట్రాక్ చేసేందుకు సీసీటీవీ కెమెరాలు, ఇత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ ప‌రిక‌రాల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా నిఘాను మ‌రింత విస్త‌రించాల‌ని సూచించింది. ఈ మేర‌కు ఫ్ల‌యింగ్ శిక్ష‌ణా సంస్థ‌ల‌కు (ఎఫ్టీఓఎస్) తెలియ చేసింది డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ)(DGCA Enhance)  . ఈ మేర‌కు తాజాగా స‌ర్క్యుల‌ర్ ను విడుద‌ల చేసింది.

ఇది 90 రోజుల్లో పూర్తి చేయాల‌ని ఏవియేష‌న్ రెగ్యులేట‌రీ క‌మిష‌న్ ఆదేశించింది. కార్య‌క‌లాపాల భ‌ద్ర‌త‌, శిక్ష‌ణా నాణ్య‌త‌ను మెరుగు ప‌ర్చేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు డీజీసీఏ వెల్ల‌డించింది. ఎఫ్టీఓలు వివిధ నియంత్రిత‌, అనియంత్రిత ఎయిర్ ఫీల్డ్ ల నుండి ప‌ని చేస్తాయి.

శిక్ష‌ణా సంస్థ‌ల త‌నిఖీ, ఆడిట్ ను పౌర విమానాయ‌న అవ‌స‌రాల ప్ర‌కారం డీజీసీఏ నిర్వ‌హిస్తుంది. ఈ ఏడాది ఆగ‌స్టు చివ‌రి నాటికి 35 ఎఫ్టీఓలు ఉన్నాయి. స్టూడెంట్ పైల‌ట్ లైసెన్స్ , ఫైట్ రేడియో టెలిఫోనీ ఆప‌రేట‌ర్స్ లైసెన్స్ ప‌రీక్ష‌ల‌ను డీజీసీఏ కు చెందిన డైరెక్ట‌రేట్ ఆఫ్ ఫ్ల‌యింగ్ ట్రైనింగ్ ప‌ర్య‌వేక్షిస్తుంది.

డీజీసీఏ నిర్ణ‌యం వ‌ల్ల అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లు త‌ప్ప‌నిస‌రిగా అప్ర‌మ‌త్తం కావాల్సిన అవ‌స‌రం ఉంది. ఎందుకంటే ఇప్పుడు భ‌ద్ర‌త అన్న‌ది ముఖ్యంగా మారింది.

Also Read : భ‌గ‌త్ సింగ్ కోష్యారీ గ‌వ‌ర్న‌ర్ కు త‌గ‌డు – ప‌వార్

Leave A Reply

Your Email Id will not be published!