Nira Chhantyal : విమాన ప్రమాదం గాయని దుర్మరణం
జానపద సింగర్ గా గుర్తింపు
Nira Chhantyal : నేపాల్ లో ల్యాండింగ్ కావాల్సిన సమయంలో ఉన్నట్టుండి కూలి పోయింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న సిబ్బంది, ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. వారిలో ఓ ప్రముఖ జానపద సింగర్ కూడా ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు కన్నీటి పర్యంతమయ్యాయి.
మొత్తం ఈ విమానంలో 72 మంది ఉన్నారు. ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రముఖ జానపద గాయని కూడా ఉన్నారు. నీరా చంత్వాల్ తన స్వర మాధుర్యంతో ఎంతో పేరు తెచ్చుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రమాదం జరిగే కంటే ముందు సోషల్ మీడియాలో నీరా చంత్వాల్(Nira Chhantyal) ఓ పోస్ట్ కూడా షస్త్రర్ చేసింది. పోఖారాలో మహిళల, పురుషుల వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్న సందర్భంగా జరిగే సంగీత కార్యక్రమాలకు నీరా చంత్వాల్ హాజరు కావాల్సి ఉంది. ఆమెను ప్రత్యేక ఇన్వైటీగా ఆహ్వానించారు నిర్వాహకులు. ఇందులో పాల్గొనేందుకని విమానంలో ప్రయాణం చేసింది.
అంతలోపే ఈ ప్రమాద ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. కాగా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఈవెంట్ ను రద్దు చేసినట్లు తెలిపారు నిర్వాహకులు. ప్రయాణించిన వారిలో నేపాలీలు, భారతీయులు, రష్యన్లు, కొరియన్లు , అర్జెంటీనా, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ కు చెందిన వారున్నారు.
ఈ విషయాన్ని ఎయిర్ లైన్స్ చని పోయిన వారందరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరింది. ఈ ఘటన జరగడం బాధాకరమని పేర్కొంది.
Also Read : పన్ను విధింపుపై కోర్టుకు అనుష్క శర్మ