Ripun Bora : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగులుతోంది. ఓ వైపు అంతర్గత కుమ్ములాటలతో సతమవుతున్న ఆ పార్టీని ఒక్కరొక్కరు విడిచి వెళుతున్నారు.
తాజాగా అస్సాం కాంగ్రెస్ మాజీ చీఫ్ రిపున్ బోరా(Ripun Bora )ఆదివారం గుడ్ బై చెప్పేశారు. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు రిపున్ బోరా. ఆయనకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది.
అస్సాంలో మంచి పట్టున్న నేతగా కూడా పేరొందారు. ఈ మేరకు ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపించారు.
ఈ సందర్భంగా ఆయన సంచలన ఆరోపణలు చేశారు పార్టీపై. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం నాయకులు ప్రస్తుత ప్రభుత్వంతో టచ్ లో ఉన్నారంటూ పేర్కొన్నారు.
బీజేపీతో రహస్య అవగాహన ఉందంటూ కుండ బద్దలు కొట్టారు. రాజీనామా చేసిన వెంటనే రిపున్ బోరా(Ripun Bora )పశ్చిమ బెంంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలో చేరారు.
ఈ మేరకు తృణమూల్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అభిషేక్ బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.
టీఎంసీలో చేరిన రిపున్ బోరాకు అభినందనలు. దృఢమైన, నైపుణ్యం కలిగిన రాజకీయవేత్తకు సాదర స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు.
ప్రజల శ్రేయస్సు కోసం కలిసి పని చేసేందుకు ముందుకు రావడం, చేతులు కలుపడం ఆనందంగా ఉందన్నారు. తాను ఎన్నో రకాలుగా చెప్పి చూశానని, కానీ పార్టీ ప్రస్తుత నాయకత్వం వినే పరిస్థితిలో లేదని వాపోయారు రిపున్ బోరా.
Also Read : ఏం తినాలో ప్రభుత్వం చెప్పదు – నఖ్వీ