Former CJI Chandrachud :వినాయక చవితికి మోదీ రాక పై స్పందించిన మాజీ సీజేఐ
భారత న్యాయవ్యవస్థ హిందూ అగ్రవర్ణ పురుషుల ఆధిపత్యంలో ఉందా?..
Former CJI Chandrachud : భారత న్యాయ వ్యవస్థపై ప్రజలకు అచంచలమైన విశ్వాసం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. బీబీసీ హార్డ్ టాక్ కార్యక్రమంలో ఆయన అడిగిన వివిధ ప్రశ్నలకు జస్టిస్ చంద్రచూడ్(Former CJI Chandrachud) తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆర్టికల్ 370 రద్దు, ప్రధాని మోదీ గణేష్ చతుర్ధి వేడుకల్లో పాల్గొనడం వంటి ప్రశ్నలకు ఆయన హుందాగా సమాధానమిచ్చారు.
Former CJI Chandrachud Comment
భారత న్యాయవ్యవస్థ హిందూ అగ్రవర్ణ పురుషుల ఆధిపత్యంలో ఉందా? అన్న ప్రశ్నకు జస్టిస్ చంద్రచూడ్ ఏకీభవించలేదు. ఆయన వివరించినట్లుగా, జిల్లా న్యాయ వ్యవస్థలో 50% కంటే ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. దేశంలో 60-70% మహిళలు న్యాయవ్యవస్థలో చేరుతోన్నారని, వారికి న్యాయ విద్య కూడా అందుతుందని చెప్పారు.
తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ, తన తండ్రి వైవీ చంద్రచూడ్(Former CJI Chandrachud) తరచూ “నువ్వు న్యాయవ్యవస్థలో అడుగు పెట్టవద్దు” అని చెప్పేవారని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. అందుకే హార్వర్డ్ లా స్కూల్‌లో మూడు సంవత్సరాలు చదివానని అన్నారు. తన తండ్రి పదవీ విరమణ తర్వాత కోర్టులో అడుగు పెట్టానని తెలిపారు.
ప్రధాని మోదీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొన్నారా? అన్న ప్రశ్నకు, జస్టిస్ చంద్రచూడ్ వివరణ ఇచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో, భారత్‌లో ఏకపక్షమైన అపోహలు తొలిగించబడ్డాయని చెప్పారు. రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరిగిందని వివరించారు.
జమ్మూ-కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు గురించి అడిగిన ప్రశ్నకు, జస్టిస్ చంద్రచూడ్ ప్రజాస్వామ్య ప్రక్రియ పునరుద్ధరించబడిందని చెప్పారు. శాంతియుతంగా అధికారం బదలాయింపు జరిగిందని చెప్పారు. జమ్మూ-కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యం విజయవంతమైనది అని పేర్కొన్నారు.
గతేడాది, జస్టిస్ డీవై చంద్రచూడ్ గణేష్ చతుర్ధి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొనడం గూర్చి విమర్శలు వచ్చాయి. దీనిపై జస్టిస్ చంద్రచూడ్ సమాధానం ఇచ్చారు. అత్యున్నత రాజ్యాంగ సంస్థలు మన వ్యవస్థలో హుందాగా వ్యవహరిస్తున్నాయని అన్నారు.
Also Read : ప్రభుత్వ సహకారంతో మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ ఏర్పాటు