Binanance Ceo : ఆసియా అత్యుత్త‌మ సంప‌న్నుడిగా జావో 

ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టేసిన సిఇఓ 

Binanance Ceo : ఇప్ప‌టి దాకా ఆసియా ఖండంలో అత్యంత ధ‌న‌వంతుడిగా టాప్ లో ఉన్న రిల‌య‌న్స్ గ్రూప్ చైర్మ‌న్ ముకేశ్ అంబానీకి కోలు కోలేని షాక్ త‌గిలింది. బినాన్స్ సిఇఓ చాంగ్ పెంగ్ జావో ముకేశ్ అంబానీని దాటేసి టాప్ లో నిలిచాడు.

క్రిప్టో ఎక్స్చేంజ్ బినాన్స్ (Binanance Ceo)ను న‌డుపుతున్న చాంగ్ పెంగ్ జావో $96.5 బిలియ‌న్ల నిక‌ర విలువ‌తో ప్ర‌పంచంలోని అగ్ర‌శ్రేణి బిలియ‌నీర్ల ర్యాంక్ లో చేరారు. క్రిప్టో క‌రెన్సీ సిఇఓ జావో అత్యంత ధ‌న‌వంతుల్లో ఒక‌డిగా నిలిచాడు.

బ్లూమ్ బెర్గ్ బిలియ‌నీర్స్ ఈ మేర‌కు ఆసియాలో అత్యుత్త‌మ బిలియ‌నీర్ల జాబితా ప్ర‌క‌టించింది. చాంగ్ పెంగ్ జావో క్రిప్టో ఎక్స్చేంజ్  బినాన్స్ ను న‌డుపుతూ వ‌స్తున్నారు గ‌త కొంత కాలం నుంచి.

ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుత అంచ‌నా ప్ర‌కారం జావో సంప‌ద ఒరాకిల్ వ్య‌వ‌స్థాప‌కుడు లారీ ఎల్లిస‌న్ కంటే కొంచెం దిగువ‌న ఉంది. గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా పెరిగిన భార‌తీయ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీని మించి పోవ‌డం  విశేషం.

ఈ చైనీస్ కెన‌డియ‌న్ వ్యాపార వేత్త సంప‌ద డిజిట‌ల్ క‌రెన్సీలో వేగంగా ఆదాయం స‌మ‌కూరింది. గ‌త ఏడాది ఇత‌ర క్రిప్టో వ్య‌వ‌స్థాప‌కులు కూడా వ‌ర్చువ‌ల్ నాణేల విలువ పుంజు కోవ‌డంతో భారీగా లాభాల‌ను పొందారు.

ఎథేరియం సృష్టిక‌ర్త విటాలిక్ బుటెరిన్ , కాయిన్ బేస్ ఫౌండ‌ర్ బ్రియాన్ ఆర్మ్ స్ట్రాంగ్ ఇద్ద‌రూ బిలియ‌నీర్లు అయ్యారు. త‌న సంప‌ద‌లో 99 శాతాన్ని కూడా త‌న సంప‌ద‌లో ఎక్కువ భాగాన్ని ఇవ్వాల‌ని అనుకుంటున్న‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా 2017 లో బినాన్స్ ను ప్రారంభించాడు. క్ర‌మంగా ప్రపంచంలోనే అతి పెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీల‌లో ఒకటిగా ఉండేలా ప్లాన్ చేశాడు.

Also Read :  మాండ‌రీయ‌న్ ఓరియంట‌ల్ మ‌నోడిదే

Leave A Reply

Your Email Id will not be published!