Natwar Singh: మాజీ కేంద్రమంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత !
మాజీ కేంద్రమంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత !
Natwar Singh: సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ విదేశాంగ మంత్రి కె నట్వర్ సింగ్(93) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ లో గల మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నట్వర్ సింగ్ చనిపోయారని కుటుంబ సభ్యులు మీడియాకు వివరించారు. సింగ్ కుటుంబ సభ్యులు ఒకరు శనివారం అర్థరాత్రి మీడియాతో మాట్లాడుతూ నట్వర్‌సింగ్ గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతూ, మేదాంతలో చికిత్స పొందుతున్నారన్నారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం ఢిల్లీలో జరుగుతాయని, ఈ కార్యక్రమాలకు అతని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరవుతారన్నారు. మన్మోహన్ సింగ్ హయాంలో నట్వర్ సింగ్(Natwar Singh) విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు.
Natwar Singh NO More
నట్వర్ సింగ్ 1931లో రాజస్థాన్‌లోని భరత్ పూర్ జిల్లాలో జన్మించారు. రాజస్థాన్ లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన నట్వర్ సింగ్… పై చదువలు కోసం ఢిల్లీకి వచ్చారు. సెయింట్ స్టీఫెన్ కాలేజీలో హిస్టరీ చదివారు. తర్వాత యూకేలో గల కేంబ్రిడ్జి వర్సిటీలో ఆపై చదువులు చదివారు. నట్వర్ సింగ్ ఐఎఫ్ఎస్‌కు ఎంపికై దౌత్యవేత్తగా పనిచేశారు. 1953లో నట్వర్ సింగ్ విదేశీ వ్యవహారాల్లో కెరీర్ ప్రారంభించారు. కెరీర్‌లో అంచెలంచెలుగా ఎదిగారు. 1973 నుంచి 1977 వరకు యూకేలో ఇండియా డిప్యూటీ హై కమిషనర్‌గా విధులు నిర్వహించారు. 1980 నుంచి 1982 వరకు పాకిస్థాన్ లో భారత రాయబారిగా పనిచేశారు. ఆ సమయంలో ఇండియా- పాకిస్థాన్ మధ్య పరిస్థితులు ఏ మాత్రం బాగోలేవు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే పనిచేస్తారని పేరు తెచ్చుకున్నారు. ఆ క్రమంలో కీలక బాధ్యతలను ఆయనకు అప్పటి ప్రభుత్వం అప్పగించింది. దౌత్యవేత్త నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. కేంద్ర సహాయ మంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేశారు. కెరీర్ ప్రారంభించిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసి, మంచి పేరు తెచ్చుకున్నారు.
రాజకీయ ప్రవేశం
1966 నుండి 1971 వరకు ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ కార్యాలయంతో పనిచేశారు. విదేశీ వ్యవహారాల నుంచి నట్వర్ సింగ్(Natwar Singh) రాజకీయరంగ ప్రవేశం చేశారు. 1984లో భారత్ పూర్ నుంచి లోక్ సభకు పోటీ చేసి గెలుపొందారు. ఆ వెంటనే రాజీవ్ గాంధీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 1985-86 వరకు ఉక్కు, మైనింగ్ శాఖ సహాయ మంత్రి పదవి అప్పగించారు. 1986లో విదేశీ వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. 2004-05లో మన్మోహన్ సింగ్ హయాంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అవార్డు నట్వర్ సింగ్ ను వరించింది. నట్వర్ సింగ్ మృతిపై రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ విచారం వ్యక్తం చేశారు.
Also Read : Rammohan Naidu: సీ.ఎం చంద్రబాబు హయాంలోనే శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బీజం: మంత్రి రామ్మోహన్ నాయుడు