Sri Lanka Crisis : మాజీ మంత్రి కారు నీళ్ల‌లోకి తోసివేత

శ్రీ‌లంక‌లో ఆగ‌ని ఆందోళ‌న‌లు నిర‌స‌న‌లు

Sri Lanka Crisis : శ్రీ‌లంక ప్ర‌ధాన మంత్రిగా ర‌ణిలె విక్ర‌మ‌సింఘే ప్ర‌మాణ స్వీకారం చేసినా దేశంలో ఇంకా ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు ఆగ‌డం లేదు. పెద్ద ఎత్తున నిప్పులు చెరుగుతున్నారు. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, సైనికులు ప‌హారా కాస్తున్నారు.

ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే ప‌నిని గొట‌బొయి రాజ‌ప‌క్సే తాజా పీఎంకు అప్ప‌గించారు. రెచ్చి పోయిన ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి వ‌చ్చారు(Sri Lanka Crisis). పెట్రోల్, డీజిల్ లేకుండా పోయింద‌ని, తినేందుకు ఆహారం దొర‌క‌డం లేదంటూ మండిప‌డ్డారు.

ఇదే స‌మ‌యంలో మాజీ మంత్రికి చెందిన కారును చుట్టు ముట్టారు. దానిని నీళ్ల‌ల్లోకి నెట్టేశారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆర్థిక సంక్షోభం, రాజ‌కీయ సంక్షోభంతో కొట్టు మిట్టాడుతోంది ద్వీప దేశం.

గ‌త కొన్ని రోజులుగా లంక అట్టుడుకుతోంది. మొద‌ట్లో శాంతియుతంగానే నిర‌స‌న తెలిపారు. గ‌త ఏప్రిల్ 19న పోలీసులు ఓ నిర‌స‌న కారుడిని కాల్చి చంపారు. ఆందోళ‌న‌కారుల‌పై బాష్ప వాయువులు, నీటి ఫిరంగుల‌ను ప్ర‌యోగించారు.

వేలాది మందిని అరెస్ట్ చేశారు. క‌ర్ఫ్యూ విధించారు(Sri Lanka Crisis). ఇదే స‌మ‌యంలో ప‌రిస్థితికి ప్ర‌ధాన కార‌కుడు ప్ర‌ధాన మంత్రి మ‌హింద రాజ‌ప‌క్సే అంటూ జ‌నం ఫైర్ అయ్యారు.

ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో మ‌హింద మ‌ద్ద‌తుదారులు , నిర‌స‌నకారుల‌పై దాడుల‌కు పాల్ప‌డ్డారు. దీంతో రెచ్చి పోయిన వారంతా దాడుల‌కు పాల్ప‌డ్డారు.

అధికార పార్టీ ఎంపీ కూడా చ‌ని పోయాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 13 మంది చ‌ని పోయిన‌ట్లు స‌మాచారం. దీంతో ప్రాణ భ‌యంతో నేవీ స్థావ‌రంలో త‌ల‌దాచుకున్నాడు మ‌హింద రాజ‌ప‌క్స‌.

 

Also Read : ఆదుకున్నందుకు మోదీకి థ్యాంక్స్

Leave A Reply

Your Email Id will not be published!