Sukhchain Singh Gill : రాకెట్ దాడి ఘటనలో నలుగురు అరెస్ట్
వెల్లడించిన పంజాబ్ పోలీసులు
Sukhchain Singh Gill : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన పంజాబ్ సరిహద్దు జిల్లాలో చోటు చేసుకున్న రాకెట్ గ్రెనడ్ దాడి ఘటన. ఈ రాకెట్ లాంచర్ దాడి ఘటనకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఘటనలో కీలక సూత్రధారులుగా భావిస్తున్న నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తర్న్ తరన్ లోని సర్హాలి పోలీస్ స్టేషన్ పై రాకెట్ తో నడిచే గ్రెనేడ్ పేలింది. గత 7 నెలల కాలంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇది రెండవసారి కావడం గమనార్హం.
తర్నర్ తరణ్ లోని ఠాణాలో ఆర్పీజీ దాడి జరిగిన మూడు రోజుల తర్వాత దానిని నిర్వహించడంలో కీలక మద్దతు అందించిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు పంజాబ్ పోలీసులు వెల్లడించారు.
దీనిని వాడేందుకు గాను మోటార్ సైకిళ్లను అందించారని అందుకే వీరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (హెడ్ క్వార్టర్స్ ) సుఖ్ చైన్ సింగ్ గిల్(Sukhchain Singh Gill) స్పష్టం చేశారు.
అంతే కాకుండా ఈ ఘటనకు ప్లాన్ చేసిన మరో ఇద్దరు కీలక వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. త్వరలోనే వారిని కూడా గుర్తించి పట్టుకుంటామని తెలిపారు. ప్రస్తుతం గాలింపు కొనసాగుతోంది. ఈ కీలక సమయంలో ఏ పేరును వెల్లడించేందుకు వీలు కుదరదని స్పష్టం చేశారు.
ఒకటి లేదా రెండు రోఉల్లో పోలీసులు పేర్లతో సహా మరిన్ని వాస్తవాలను వెల్లడించడం జరుగుతుందని చెప్పారు. ఎడిజిపి (కౌంటర్ ఇంటెలిజెన్స్ ) అమిత్ ప్రసాద్ అమృత్ సర్ లో క్యాంపింగ్ లో ఉండగా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ ఎన్ ధోక్ పర్యవేక్షణలో విచారణ జరుగుతోందన్నారు గిల్.
Also Read : దేశాన్ని చీకట్లో ఉంచిన కేంద్రం – ఓవైసీ