Emmanuel Macron : ఫ్రాన్స్ కు చెందిన ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రెండోసారి ఆ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. మాక్రానా (Emmanuel Macron)విజయంతో ఐరోపాలో ఇతర దేశాలకు ఒకింత ఉపశమనం కలిగించిందనే చెప్పక తప్పదు.
ఇదిలా ఉండగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రెండు దశాబ్దాల పాటు రెండో సారి గెలిచిన మొదటి ఫ్రెంచ్ అధ్యక్షుడు కావడం విశేషం. మాక్రాన్ తన ప్రత్యర్థి మెరైన్ లే పెన్ ను ఓడించారు.
ఓట్ల లెక్కింపు నమూనా ఆధారంగా పోలింగ్ సంస్థల అంచనాల ప్రకారం సెంటిస్ట్ మాక్రా న్ (Emmanuel Macron)రౌండ్ ఇన్ ఆఫ్ లో 42 శాతం ఓట్లతో పోలిస్తే 58 శాతం ఓట్లను పెంచు కోవడం గమనార్హం.
ఇదిలా ఉండగా మాక్రాన్ ఎన్నిక మరింత పోటీగా, రసవత్తరంగా, ఉత్కంఠ భరితంగా సాగింది. ప్రత్యర్థిగా నిలిచిన లే పెన్ చివరి దాకా వచ్చి ఆగి పోయింది. ఒకానొక దశలో మాక్రాన్ ఓడి పోతారన్న అనుమానం నెలకొంది.
కానీ అనూహ్యంగా ఆయన పుంజుకున్నారు. విజేతగా నిలిచారు. 44 ఏళ్ల వయసు కలిగిన మాక్రాన్ తన రెండో టర్మ్ లో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
జూన్ లో జరిగే పార్లమెంటరీ ఎన్నికలలో కచ్చితంగా స్పష్టమైన మెజారిటీ వచ్చేలా చూసుకోవాలి. ఫ్రాన్స్ ను సంస్కరించాలనే తన ఆశయాలను ఏ మేరకు నెరవేరుస్తాడనేది ప్రశ్నార్థకంగా మారింది.
తనను గెలిపించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలిపారు మాక్రాన్. ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఓటు వేసిన వారికి వేయని వారికి కూడా కృతజ్ఞతలు తెలిపారు.
ఇదిలా ఉండగా తాను ఓడి పోయినా పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేసింది లే పెన్.
Also Read : రష్యా దాడులపై జపాన్ యాంకర్ కంటతడి