Free Sand: ఉచితం పేరుతో ఇసుక దోపిడీ.. ఇదేటి బాబు పవన్ !

ఉచితం పేరుతో ఇసుక దోపిడీ.. ఇదేటి బాబు పవన్ !

Free Sand: ఉచితం పేరుతో చంద్రబాబు సర్కార్‌ ఇసుక దోపిడీకి తెరలేపింది. ఉచితంగా ఇసుక ఇస్తామంటూ డబ్బులు వసూలు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. సీఎం చంద్రబాబు మోసం చేశారంటున్న ప్రజలు.. ఇదేమి ఉచిత ఇసుక విధానమని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో టన్ను ఇసుక ధర పెంచేశారు. విశాఖపట్నం భీమిలిలో టన్ను ఇసుక ధర రూ.758 నుంచి రూ.1076 పెరిగింది. ఒకేసారి రూ.318 పెంచడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తు మండిపడుతున్నారు.

Free Sand Policy

మేము అధికారంలోకి వస్తే ప్రజలందరికీ ఉచితంగా ఇసుక ఇస్తామని కూటమి నేతలు ప్రగల్భాలు పలికారు. తాజాగా ఉచిత ఇసుక అనేది అబద్ధమని తేలిపోయింది. అధికారంలోకి రాగానే ఉచితం మాట పక్కన పెట్టి దోపిడీకి తెరతీశారు. కూటమి నేతలు ఇసుకను అక్రమంగా తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దిగిపోయే నాటికి 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక ఉండగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక దోచుకున్నారని పలువురు చెబుతున్నారు. కొన్ని చోట్ల ఉచిత ఇసుక అంటూనే రూ.17,000 నుంచి రూ. 18,000 వరకూ వసూలు చేస్తున్నారు. ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Also Read : Kerala Landslides : వాయనాడ్ చేరుకుని బాధితులను పరామర్శించిన రాహుల్, ప్రియాంక గాంధీ

Leave A Reply

Your Email Id will not be published!