S Jai Shankar : స్వేచ్ఛా వాణిజ్యం ఓ గేమ్ ఛేంజర్
కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్
S Jai Shankar India-EU FTA : ఐరోపా సమాఖ్యతో ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని గేమ్ ఛేంజర్ గా భారత్ భావిస్తోందని స్పష్టం చేశారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్. గత ఏడాది జూన్ లో భారత దేశం , యూరోపియన్ యూనియన్ ఎనిమిదేళ్ల విరామం తర్వాత దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న వాణిజ్య , పెట్టుబడి ఒప్పందానికి సంబంధించిన చర్చలను పునః ప్రారంభించాయి. యూరప్ , భారత్ డిపెండెన్సీలను తగ్గించడం ద్వారా వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేసుకోవచ్చని అన్నారు.
ఈ ఒప్పందం కోసం సంప్రదింపుల ప్రక్రియకు సంబంధించి పరస్పర ప్రయోజనకరమైన ముగింపు కోసం ఎదురు చూస్తోందని అన్నారు జై శంకర్. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. కాన్ఫెడరేషన్ ఆంఫ్ ఇండియా ఇండస్ట్రీ వద్ద జరిగిన కార్యక్రమంలో జై శంకర్(S Jai Shankar) పాల్గొన్నారు.
ఆధార పడటాన్ని తగ్గించడం, క్లిష్టమైన సాంకేతికతలపై సహకరించడం , సరఫరా గొలుసు పునర్నిర్మాణాన్ని నిర్దారించడం ద్వారా పరస్పరం వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేసుకోవచ్చని అన్నారు సుబ్రమణ్యం జై శంకర్. సహేతుకమైన ప్రణాళికా బద్దమైన కాలక్రమంలో చర్చల ప్రక్రియకు పరస్పర ప్రయోజనకరమైన ముగింపు కోసం ఎదురు చూస్తున్నామని స్పష్టం చేశారు.
జూన్ 2007లో ప్రారంభించ బడిన ప్రతిపాదిత ఒప్పందానికి సంబంధించిన చర్చలు చాలా అడ్డంకులు ఎదుర్కొన్నాయి. ఎందుకంటే రెండు వైపులా కీలకమైన అంశాలు ఒక కొలిక్కి రాలేక పోయాయి. యూఏఈ, ఆస్ట్రేలియాతో జరిగిన ఎఫ్టీఏలు వాస్తవానికి రికార్డు సమయంలో ముగిశాయని స్పష్టం చేశారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్(S Jai Shankar India-EU FTA).
Also Read : భారత్ కు రానున్న చైనా విదేశాంగ మంత్రి